ఆయన చెప్పారు.. ఈమె పాటిస్తున్నారు!

ఆయన చెప్పారు.. ఈమె పాటిస్తున్నారు!
పూజా హెగ్డే.. ఈ తరం కుర్రకారు కలలరాణి. మహేశ్ బాబు, జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్, ప్రభాస్.. ఇలా వరుసగా అగ్ర కథానాయకుల చిత్రాల్లో నటిస్తూ తారాపథంలో దూసుకుపోతోంది పూజ. ఇదిలా ఉంటే.. ఈ టాలెంటెడ్ బ్యూటీ తనలోని మరో కోణాన్ని ఆవిష్కరించనుందట. ఓ తెలుగు చిత్రం కోసం తొలిసారిగా పాట పాడేందుకు సిద్ధమవుతోందట ఈ సుందరి. అది కూడా.. ఓ మాస్ సాంగ్ అని సమాచారం.
ఆ డిటైల్స్లోకి వెళితే.. అల్లు అర్జున్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో ఓ ఫ్యామిలీ ఎంటర్టైనర్ రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో మెయిన్ హీరోయిన్గా పూజా హెగ్డే నటిస్తోంది. అంతేకాదు, ఈ చిత్రం కోసం గాయనిగా తొలిసారిగా తన గొంతుని సవరించుకోనుందని సమాచారం. చిత్ర సంగీత దర్శకుడు తమన్ ప్రోద్బలంతోనే పూజ తన సింగింగ్ డెబ్యూకి రెడీ అవుతోందట. ఇందుకు త్రివిక్రమ్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని టాక్.
ఆసక్తికరమైన విషయమేమిటంటే… త్రివిక్రమ్ గత చిత్రం ‘అరవింద సమేత’ కోసం తన కెరీర్లో తొలిసారిగా డబ్బింగ్ చెప్పుకున్న పూజ… ఇప్పుడు అదే దర్శకుడి సినిమాతో గాయనిగానూ తొలి అడుగులు వేస్తుండడం విశేషం. మొత్తానికి.. పూజపై త్రివిక్రమ్ ఎఫెక్ట్ బాగానే ఉందన్నమాట.
ఆయన చెప్పారు.. ఈమె పాటిస్తున్నారు! | actioncutok.com
More for you: