శర్వానంద్‌ను డైరెక్ట్ చేయనున్న డాన్స్ మాస్టర్


శర్వానంద్‌ను డైరెక్ట్ చేయనున్న డాన్స్ మాస్టర్
Sharwanand and Raju Sundaram

శర్వానంద్‌ను డైరెక్ట్ చేయనున్న డాన్స్ మాస్టర్

యువ క‌థానాయ‌కుడు శ‌ర్వానంద్ ప్ర‌స్తుతం ‘ర‌ణరంగం’, ’96’ రీమేక్‌ల‌తో బిజీగా ఉన్న సంగ‌తి తెలిసిందే. ‘ర‌ణరంగం’ ఆగ‌స్టు 2న విడుద‌ల కానుండ‌గా, ’96’ రీమేక్ ప్ర‌స్తుతం చిత్రీక‌ర‌ణ ద‌శ‌లో ఉంది. కాగా, ’96’ రిలీజ‌య్యే లోపే.. మ‌రో ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్‌ని ప‌ట్టాలెక్కించేందుకు శ‌ర్వా స‌న్నాహాలు చేస్తున్నాడ‌ట‌.

ఆ వివ‌రాల్లోకి వెళితే.. ప్ర‌ముఖ నృత్య ద‌ర్శ‌కుడు రాజు సుంద‌రం ఇటీవ‌ల శ‌ర్వాని సంప్ర‌దించి ఓ ఆస‌క్తిక‌ర‌మైన క‌థ చెప్పాడ‌ట‌. అది న‌చ్చ‌డంతో వెంట‌నే రాజు సుంద‌రం ద‌ర్శ‌క‌త్వంలో ఈ సినిమా చేయ‌డానికి శ‌ర్వా గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చాడ‌ట‌. ఏకే ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ ప‌తాకంపై అనిల్ సుంక‌ర ఈ చిత్రాన్ని నిర్మించ‌బోతున్నాడ‌ని స‌మాచారం. ప్ర‌స్తుతం న‌టీన‌టులు, సాంకేతిక నిపుణులని ఎంపిక చేసే ప‌నిలో ఉన్నాడు రాజు సుంద‌రం. ఈ ఏడాది చివ‌ర‌లో ఈ ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ ప‌ట్టాలెక్క‌నుంద‌ని తెలుస్తోంది.

శర్వానంద్‌ను డైరెక్ట్ చేయనున్న డాన్స్ మాస్టర్ | actioncutok.com

More for you: