‘రాక్షసుడు’ టీజర్ ఇంప్రెసివ్‌గానే ఉంది..


'రాక్షసుడు' టీజర్ ఇంప్రెసివ్‌గానే ఉంది..

‘రాక్షసుడు’ టీజర్ ఇంప్రెసివ్‌గానే ఉంది..

బెల్లంకొండ సాయిశ్రీనివస్, అనుపమా పరమేశ్వరన్ జంటగా నటించిన ‘రాక్షసుడు’ టీజర్ విడుదలైంది. తమిళంలో విజయం సాధించిన క్రైం థ్రిల్లర్ ‘రాక్షసన్’కు ఇది రీమేక్. కోనేరు సత్యనారాయణ నిర్మిస్తున్న ఈ చిత్రానికి రమేశ్‌వర్మ డైరెక్టర్. ఈ సినిమాలో శ్రీనివాస్ పోలీస్ ఇన్‌స్పెక్టర్‌గా కనిపించనున్నాడు.

టీజర్ ఇంప్రెసివ్‌గా, ఉత్కంఠభరితంగా, అదే సమయంలో భీతి కొలిపేలా ఉంది. ఒరిజినల్‌ను డీవియేట్ చేయకుండా ‘రాక్షసుడు’ను రమేశ్‌వర్మ రూపొందించినట్లు అనిపిస్తోంది. జూలై 18న సినిమా ప్రేక్షకుల ముందుకు రానున్నది.

బెల్లంకొండ శ్రీనివాస్ మునుపటి సినిమాలు ‘కవచం’, ‘సీత’.. ఒక దాన్ని మించి మరొకటి డిజాస్టర్స్ అయ్యాయి. సీరియల్ కిల్లర్ కథాంశంతో రూపొందిన ‘రాక్షసుడు’ పైనే అతని ఆశలన్నీ ఉన్నాయి. ఈ సినిమా అయినా అతని కెరీర్‌లో తొలి హిట్‌గా నిలుస్తుందో, లేదో చూడాలి.

‘రాక్షసుడు’ టీజర్ ఇంప్రెసివ్‌గానే ఉంది.. | actioncutok.com

More for you: