‘రౌడీ బేబీ’కి 50 కోట్లు!

‘రౌడీ బేబీ’కి 50 కోట్లు!
ఓ దక్షిణాది పాటకి యూ ట్యూబ్‌లో 100 మిలియన్ వ్యూస్ రావడమే రెండు సంవత్సరాల క్రితం వరకు గగనమైన విషయం. అలాంటిది.. 500 మిలియన్ వ్యూస్ (50 కోట్లు)కి మన దక్షిణాది పాట చేరుకుందంటే అది కచ్చితంగా సంచలనమే. అలాంటి అరుదైన రికార్డును సొంతం చేసుకుంది.. ఓ తమిళ పాట. అదే.. ధనుష్, సాయిపల్లవి జంటగా నటించిన తమిళ చిత్రం ‘మారి 2’లోని ‘రౌడీ బేబీ’ పాట.
వాస్తవానికి.. భారీ అంచనాల మధ్య వచ్చిన ‘మారి 2’ బాక్సాఫీస్ వద్ద పేలవమైన పెర్ఫార్మెన్స్ ఇచ్చింది. తమిళంలోనే కాదు తెలుగు డబ్బింగ్ వెర్షన్ కూడా డిజాస్టర్‌గా నిలచింది. అయితే.. ‘మారి 2’ బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ అయినా.. అందులోని ‘రౌడీ బేబీ’ పాట మాత్రం యూట్యూబ్‌లో ‘బ్లాక్‌బస్టర్ కా బాప్’ అనిపించుకుంది.
సాయిపల్లవి గ్రేస్ స్టెప్స్, ధనుష్ – సాయిపల్లవి కెమిస్ట్రీ, ప్రభుదేవా కొరియోగ్రఫీ, యువన్ శంకర్ రాజా బాణీ, ధనుష్ – డీ గానం, పాట చిత్రీకరణ.. వెరసి ఈ ‘రౌడీ బేబీ’ యూట్యూబ్ సెన్సేషన్ అయ్యింది. కేవలం 5 నెలల్లో 500 మిలియన్ వ్యూస్‌కి చేరుకున్న ఈ పాట.. త్వరలోనే బిలియన్ క్లబ్లో చేరుతుందేమో చూడాలి మరి.
‘రౌడీ బేబీ’కి 50 కోట్లు! | actioncutok.com
More for you: