ఆర్ ఆర్ ఆర్: మైండ్ బ్లోయింగ్ ఇంట‌ర్వెల్ బ్యాంగ్‌?


ఆర్ ఆర్ ఆర్: మైండ్ బ్లోయింగ్ ఇంట‌ర్వెల్ బ్యాంగ్‌?

ఆర్ ఆర్ ఆర్: మైండ్ బ్లోయింగ్ ఇంట‌ర్వెల్ బ్యాంగ్‌?

ఆర్ ఆర్ ఆర్: మైండ్ బ్లోయింగ్ ఇంట‌ర్వెల్ బ్యాంగ్‌?పోరాట ఘ‌ట్టాల‌ను తెర‌కెక్కించ‌డంలో ద‌ర్శ‌కుడు రాజ‌మౌళి శైలే వేరు. ఇక ‘బాహుబ‌లి’ సిరీస్‌లో చిత్రీక‌రించిన యుద్ధ స‌న్నివేశాలు.. ప్రేక్ష‌కుల‌ను మ‌రో ప్ర‌పంచానికి తీసుకెళ్ళాయి. ఈ నేప‌థ్యంలోనే.. త‌న తాజా చిత్రం ‘ఆర్ ఆర్ ఆర్‌’లోనూ విశ్రాంతి ఘ‌ట్టాల‌ను భారీ స్థాయిలో చిత్రీక‌రిస్తున్నాడ‌ట జ‌క్క‌న్న‌.

దాదాపు 1500 మంది దేశీ, విదేశీ జూనియ‌ర్ ఆర్టిస్టుల న‌డుమ వ‌చ్చే ఈ దృశ్యాలను.. ప్ర‌స్తుతం హైద‌రాబాద్‌లోని అల్యూమినియం ఫ్యాక్ట‌రీలో వేసిన భారీ సెట్‌లో చిత్రీక‌రిస్తున్నారు.  ఈ స‌న్నివేశాల్లో ఇప్ప‌టికే చిత్ర క‌థానాయ‌కుల్లో ఒక‌రైన య‌న్టీఆర్ పాల్గొంటుండ‌గా, త్వ‌ర‌లోనే మ‌రో హీరో రామ్ చ‌ర‌ణ్ కూడా జాయిన్ కానున్నాడ‌ట‌.  అంతే కాదు, ఈ విశ్రాంతి ఘ‌ట్టాలు సినిమాకే హైలైట్‌గా నిలుస్తాయ‌ని స‌మాచారం.

కాగా, ప్రస్తుతం జరుగుతున్న ఈ షెడ్యూల్ పూర్తైన వెంటనే.. కొన్ని కీలక  సన్నివేశాలను చిత్రీకరించేందుకు నార్త్ ఇండియాకు, అనంత‌రం  విదేశాలకు బయలుదేరనుందట యూనిట్. ఆపై హైద‌రాబాద్‌, గుజ‌రాత్‌, రాజ‌స్థాన్‌, కేర‌ళ ప‌రిస‌ర ప్రాంతాల్లో మిగిలిన షెడ్యూల్స్ జ‌రుగుతాయ‌ని స‌మాచారం. ఇలా పక్కాగా షెడ్యూల్స్‌ను ప్లాన్ చేసుకున్న యూనిట్.. చిత్రాన్ని ఈ సంవత్సరాంతానికల్లా పూర్తి చేయాలనే ఆలోచనలో ఉందట.

డీవీవీ దానయ్య నిర్మిస్తున్న ఈ పిరియాడిక్ డ్రామా ఇప్ప‌టికే 40 శాతం చిత్రీకరణ పూర్తిచేసుకుంద‌ని స‌మాచారం. 2020 జూలై 30న ఈ క్రేజీ ప్రాజెక్ట్ థియేట‌ర్ల‌లోకి రానుంది.

More for you: