ఆర్ ఆర్ ఆర్‌: ఓవ‌ర్సీస్ బిజినెస్ అదిరింది!


ఆర్ ఆర్ ఆర్‌: ఓవ‌ర్సీస్ బిజినెస్ అదిరింది!

ఆర్ ఆర్ ఆర్‌: ఓవ‌ర్సీస్ బిజినెస్ అదిరింది!

ఈ త‌రం అగ్ర క‌థానాయ‌కులు జూనియర్ ఎన్టీఆర్‌, రామ్ చ‌ర‌ణ్ కాంబినేష‌న్‌లో అగ్ర శ్రేణి ద‌ర్శ‌కుడు రాజ‌మౌళి రూపొందిస్తున్న భారీ మ‌ల్టిస్టార‌ర్ మూవీ ‘ఆర్ ఆర్ ఆర్‌’. రూ.350 కోట్ల‌కు పైగా బ‌డ్జెట్‌తో డీవీవీ దాన‌య్య నిర్మిస్తున్న ఈ సినిమా.. ప్ర‌స్తుతం శ‌ర‌వేగంగా చిత్రీక‌ర‌ణ జ‌రుపుకుంటోంది. ఒక‌వైపు చిత్రీక‌ర‌ణ సాగుతున్న స‌మ‌యంలోనే.. మ‌రో వైపు బిజినెస్ డీల్స్ కూడా జ‌రుగుతున్నాయ‌ని స‌మాచారం.

లేటెస్ట్ ట్రేడ్ బ‌జ్ ప్ర‌కారం.. ‘ఆర్ ఆర్ ఆర్‌’కి సంబంధించిన ఓవ‌ర్సీస్ బిజినెస్‌ క్లోజ్ అయ్యింద‌ని తెలిసింది. దుబాయ్‌కి చెందిన ఓ బ‌డా డిస్ట్రిబ్యూట‌ర్  ఈ క్రేజీ మ‌ల్టిస్టార‌ర్ ఓవ‌ర్సీస్ రైట్స్ (అన్ని భాష‌ల‌కు చెందిన రైట్స్‌)ను రూ. 65 కోట్ల‌కు కుదుర్చుకున్నాడ‌ని స‌మాచారం. ఒక్క చైనాలో త‌ప్ప మిగిలిన అన్ని దేశాల్లోనూ (ఫారిన్ కంట్రీస్‌) విడుద‌ల చేసుకునే హ‌క్కుల‌ను ఆయ‌న కైవ‌సం చేసుకున్నాడ‌ని టాక్‌.  వాస్త‌వానికి ఇంచుమించుగా ఇంతే మొత్తం స‌ద‌రు పంపిణీదారుడు ఇదివ‌ర‌కు ఆఫ‌ర్ చేశాడ‌ని.. అయితే దాన‌య్య మాత్రం రూ. 70 కోట్ల డీల్ కోసం చూశార‌ని ఆ మ‌ధ్య వార్త‌లు వ‌చ్చాయి. అయితే ఇప్పుడు రూ. 65 కోట్ల‌కు ఓవ‌ర్సీస్ డీల్ క్లోజ్ కావ‌డం విశేషం.

కాగా, ‘ఆర్ ఆర్ ఆర్‌’ వ‌చ్చే ఏడాది జూలై 30న ప్ర‌పంచ‌వ్యాప్తంగా విడుద‌ల కానుంది.

ఆర్ ఆర్ ఆర్‌: ఓవ‌ర్సీస్ బిజినెస్ అదిరింది! | actioncutok.com

More for you: