‘ఆర్ ఆర్ ఆర్’ రైట్స్ మరీ ఇంత ఓవరా?


'ఆర్ ఆర్ ఆర్' రైట్స్ మరీ ఇంత ఓవరా?

‘ఆర్ ఆర్ ఆర్’ రైట్స్ మరీ ఇంత ఓవరా?

‘బాహుబ‌లి’ సిరీస్ త‌రువాత రాజ‌మౌళి రూపొందిస్తున్న చిత్రం ‘ఆర్ ఆర్ ఆర్‌’. యన్టీఆర్, రామ్ చరణ్ క‌థానాయ‌కులుగా న‌టిస్తున్న‌ ఈ మాసివ్ మ‌ల్టీస్టార‌ర్ మూవీ.. దాదాపు రూ.350 కోట్ల బ‌డ్జెట్‌తో తెర‌కెక్కుతోంది.

ప్ర‌స్తుతం చిత్రీకరణ దశలో ఉన్న ఈ సినిమాకి.. అప్పుడే ఓవ‌ర్సీస్ రైట్స్ కి సంబంధించి డిస్కషన్స్ ప్రారంభమైపోయాయ‌ని టాలీవుడ్ టాక్‌. ‘సాహో’ ఓవర్సీస్ రైట్స్  పొందిన‌ దుబాయ్ సంస్థ ఒకటి.. తాజాగా చిత్ర నిర్మాత డీవీవీ దానయ్యతో   చర్చలు జరిపిందని సమాచారం. ఆ సంస్థ దాదాపు రూ.66 కోట్ల వరకు ఆఫర్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. అయితే… దానయ్య మాత్రం రూ.70 కోట్లకు పైగా అయితేనే రైట్స్ ఇవ్వడానికి సుముఖంగా ఉన్నాడ‌ట. అయితే… ఈ మధ్యకాలంలో తెలుగు సినిమాల‌కు ఓవర్సీస్ మార్కెట్ అంత‌ ఆశాజనకంగా లేకపోవడంతో.. దానయ్య చెప్పిన రేటుకి రైట్స్ కొనడానికి ఓవర్సీస్ సంస్థలు ఆలోచిస్తున్నాయని సమాచారం.

అయితే.. ‘బాహుబలి’ సిరీస్ తర్వాత రాజమౌళి డైరెక్ట్ చేస్తున్న మూవీ కావడం, దానికి తోడు యన్టీఆర్, చరణ్ వంటి స్టార్ హీరోస్ ఉండడంతో.. ఈ సినిమా రైట్స్ విషయంలో రాజీప‌డే ఆలోచ‌నే లేద‌ని దానయ్య భావిస్తున్న‌ట్టు టాక్‌.

మ‌రి.. ఓవర్సీస్ రైట్స్ విషయంలో దానయ్య చెప్పిన రేటుకే ఈ డీల్ క్లోజ్ అవుతుందో లేదో చూడాలి.

‘ఆర్ ఆర్ ఆర్’ రైట్స్ మరీ ఇంత ఓవరా? | actioncutok.com

More for you: