‘ఆర్ ఆర్ ఆర్‌’, ‘సాహో’, ‘సైరా’.. వహ్వా అనిపిస్తున్న ఓవ‌ర్సీస్ డీల్స్‌


'ఆర్ ఆర్ ఆర్‌', 'సాహో', 'సైరా'.. వహ్వా అనిపిస్తున్న ఓవ‌ర్సీస్ డీల్స్‌

‘ఆర్ ఆర్ ఆర్‌’, ‘సాహో’, ‘సైరా’.. వహ్వా అనిపిస్తున్న ఓవ‌ర్సీస్ డీల్స్‌

టాలీవుడ్‌లో రూ.200 కోట్ల‌కు పైగా బ‌డ్జెట్‌తో తెర‌కెక్కే సినిమాల సంఖ్య పెరిగిపోతోంది. ప్ర‌స్తుతం నిర్మాణంలో ఉన్న చిత్రాల‌లో ‘సాహో’, ‘సైరా’, ‘ఆర్ ఆర్ ఆర్‌’.. ఈ త‌ర‌హా సినిమాలే. పాన్‌-ఇండియా అప్పీల్‌తో తెర‌కెక్కుతున్న ఈ సినిమాల‌న్నీ కూడా తెలుగుతో పాటు ఇత‌ర భాష‌ల్లోనూ అనువాదం కానున్నాయి. ఇదిలా ఉంటే.. ఈ చిత్రాల‌ బ‌డ్జెట్‌కి త‌గ్గ‌ట్టే వీటి ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా అద‌ర‌హో అనిపించేలా జ‌రుగుతోందని స‌మాచారం. ముఖ్యంగా.. ఓవ‌ర్సీస్ బిజినెస్ ప‌రంగా ఈ సినిమాలు వార్త‌ల్లో నిలుస్తున్నాయి.  

'ఆర్ ఆర్ ఆర్‌', 'సాహో', 'సైరా'.. వహ్వా అనిపిస్తున్న ఓవ‌ర్సీస్ డీల్స్‌

ఇప్ప‌టికే ‘ఆర్ ఆర్ ఆర్‌’ ఓవ‌ర్సీస్ బిజినెస్ రూ.65 కోట్ల‌కు పూర్త‌య్యింద‌ని ఒక వైపు వార్త‌లు వినిపిస్తుండ‌గా.. మ‌రో వైపు ‘సాహో’ ఓవ‌ర్సీస్ రైట్స్ రూ.43 కోట్ల‌కు ప‌లికాయ‌ని ట్రేడ్ టాక్‌. అంతేకాదు, ఈ రెండు సినిమాల ఓవ‌ర్సీస్ రైట్స్‌ని  దుబాయ్‌కి చెందిన ఒకే పంపిణీదారుడు పొందాడ‌ని తెలుస్తోంది. ఇక ‘సైరా’ విష‌యానికి వ‌స్తే.. రూ.25 కోట్ల వ‌ర‌కు ఓవ‌ర్సీస్ బిజినెస్‌ డీల్ జ‌రుగుతోంద‌ని తెలుస్తోంది. మొత్త‌మ్మీద ఈ తీరు చూస్తుంటే.. మున్ముందు తెలుగు సినిమాల ఓవ‌ర్సీస్ బిజినెస్ రూ.100 కోట్ల‌కు చేరుకున్నా ఆశ్చ‌ర్య‌ప‌డ‌న‌క్క‌ర్లేదు.    

'ఆర్ ఆర్ ఆర్‌', 'సాహో', 'సైరా'.. వహ్వా అనిపిస్తున్న ఓవ‌ర్సీస్ డీల్స్‌

‘ఆర్ ఆర్ ఆర్‌’, ‘సాహో’, ‘సైరా’.. వహ్వా అనిపిస్తున్న ఓవ‌ర్సీస్ డీల్స్‌ | actioncutok.com

More for you: