‘బుర్రకథ’లో ‘సాహో’ డైలాగ్స్


'బుర్రకథ'లో 'సాహో' డైలాగ్స్

‘బుర్రకథ’లో ‘సాహో’ డైలాగ్స్

“ఎవరు వీళ్లు?”

“ఫ్యాన్స్”

“ఇంత వయొలెంట్ గా ఉన్నారేంటి?”

“డై హార్డ్ ఫ్యాన్స్”

.. ‘సాహో’ ట్రైలర్ చూసిన వాళ్లకు ఈ డైలాగులు గుర్తుండే ఉంటాయి. ప్రభాస్, శ్రద్ధా కపూర్ మధ్య వచ్చే డైలాగ్స్ ఇవి. ‘సాహో’ ఆగస్ట్ 15న ప్రేక్షకుల ముందుకు రానుంది.

కానీ ఇవే డైలాగ్స్ ఈ నెల 28న వచ్చే మరో సినిమాలో చూడబోతున్నాం. ఆ సినిమా.. ఆది సాయికుమార్ హీరోగా డైమండ్ రత్నబాబు డైరెక్ట్ చేసిన ‘బుర్ర కథ’. అవును. ప్రభాస్ చెప్పే డైలాగ్స్ ను ఈ సినిమాలో కమెడియన్ పృథ్వీ చెప్పాడు. ఆ డైలాగ్ సీన్ ను ‘బుర్ర కథ’ ట్రైలర్ లో ఉపయోగించారు.

ఒక సినిమా హిట్ డైలాగ్ ను మరో సినిమాలో అనుకరించడం కొత్తేమీ కాదు. కానీ ఒరిజినల్ సినిమా రిలీజ్ కాకముందే, అందులోని డైలాగ్స్ ను అనుకరించిన సినిమా ముందుగా విడుదల అవుతుండటం ఇక్కడ గమనార్హం.

Here’s the trailer for you:

‘బుర్రకథ’లో ‘సాహో’ డైలాగ్స్ | actioncutok.com

More for you: