‘సాహో’ టీజర్ ఎఫెక్ట్: బాలీవుడ్ సైతం అసూయపడాల్సిందే!


– సజ్జా వరుణ్
'సాహో' టీజర్ ఎఫెక్ట్: బాలీవుడ్ సైతం అసూయపడాల్సిందే!

‘సాహో’ టీజర్ ఎఫెక్ట్: బాలీవుడ్ సైతం అసూయపడాల్సిందే!

అభిమానులు ఎంతాగానో ఎదురుచూసిన ‘సాహో’ టీజర్ వచ్చేసింది. ఊహించినట్లుగానే వాళ్లను అమితానందభరితుల్ని చేసింది. ‘సాహో’ ఏ స్థాయి సాంకేతిక విలువలతో, ప్రమాణాలతో రూపొందుతోందో ఈ టీజర్ తెలియజేసింది. తెలుగు సినిమాని ఇంకెంత మాత్రమూ తక్కువ చెయ్యకూడదనే మాటలకు బలాన్ని చేకూర్చేలా ‘సాహో టీజర్ ఉన్నదని చెప్పక తప్పదు. బాలీవుడ్ సైతం ఉలిక్కిపడేలా ఈ సినిమా తయారవుతున్నదనే నమ్మకాన్ని ఈ టీజర్ కలిగిస్తోంది.

ప్రభాస్, శ్రద్ధా కపూర్ జంటగా సుజిత్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా టాలీవుడ్ సగర్వంగా సమర్పిస్తోన్న అత్యున్నత స్థాయి యాక్షన్ ఎంటర్‌టైనర్ అని చెప్పుకోవచ్చు. సన్నివేశాల్ని చిత్రీకరించిన తీరు.. ముఖ్యంగా యాక్షన్ ఎపిసోడ్స్‌ను తీసిన విధానం సగటు తెలుగు సినిమా స్థాయికి ఎన్నో రెట్లు ఉన్నత స్థాయిలో ఉంది. మది సినిమాటోగ్రఫీ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అవుతుంది.

'సాహో' టీజర్ ఎఫెక్ట్: బాలీవుడ్ సైతం అసూయపడాల్సిందే!

‘రన్ రాజా రన్’ అనే ఏకైక సినిమా తీసిన డైరెక్టర్ సుజిత్‌ను ప్రభాస్ ఎందుకు నమ్మాడనేందుకు సాక్ష్యంగా ‘సాహో’ టీజర్ నిలిచిందని చెప్పాలి. ఈ సినిమా కోసం ప్రభాస్ తన వాయిస్ కల్చర్‌ను పూర్తిగా మార్చేసినట్లు కనిపిస్తోంది. సాధారణంగా సాఫ్ట్‌గా ఉండే ప్రభాస్ గొంతు ఈ సినిమాలో గంభీరంగా వినిపిస్తోంది.

“బాధైనా, హ్యాపీనెస్ అయినా నాతో షేర్ చేసుకోడానికి ఎవరూ లేరు” అని శ్రద్ధ అంటే, “నేనున్నాను” అని ప్రభాస్ నోటి వెంట వచ్చిన మాటలు విని, ఒక్క క్షణం ఆ మాటలు అతనివేనా అనే సందేహం కలిగుతుంది. తర్వాత ఆ గొంతు ప్రభాస్‌దే అని నిర్ధారణ చేసుకుంటాం. అంతలా తన గొంతును మార్చేశాడు ప్రభాస్.

'సాహో' టీజర్ ఎఫెక్ట్: బాలీవుడ్ సైతం అసూయపడాల్సిందే!

తమపై కాల్పులు జరుగుతున్న దుండగుల్ని చూసి “అసలు ఎవరు వీళ్లు?” అని శ్రద్ధ అడిగితే, “ఫ్యాన్స్” అని కూల్‌గా ప్రభాస్ చెప్పడం, శ్రద్ధ లేచి బయటకు వెళ్లడానికి ప్రయత్నించి, కాల్పుల మోతకు వెనక్కి తగ్గి “ఇంత వయొలెంట్‌గా ఉన్నారు?” అంటే, ప్రభాస్ అంతే కూల్‌గా “డైహార్డ్ ఫ్యాన్స్” అనడం ఆ వయొలెంట్ సీన్‌లోనూ వినోదాన్ని పంచింది.

1.38 నిమిషాల నిడివి ఉన్న టీజరే ఇలా ఉంటే, ఇక రాబోయే థియేట్రికల్ ట్రైలర్ ఏ రేంజిలో ఉంటుందోననే ఆసక్తి వ్యక్తమవుతుందోంది. ఇప్పటికే నాగార్జున, రాజమౌళి, రానా, పూరి జగన్నాథ్, నాని, తమన్నా, నితిన్, విజయ్ దేవరకొండ, అల్లు శిరీష్ వంటి టాలీవుడ్ ప్రముఖులు అనేక మంది ‘సాహో’ టీజర్ చూసి ప్రశంసలు కురిపించారు.

'సాహో' టీజర్ ఎఫెక్ట్: బాలీవుడ్ సైతం అసూయపడాల్సిందే!

స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆగస్ట్ 15న ‘సాహో’ తెలుగు, తమిళ, హిందీ భాషల్లో విడుదలవుతోంది.

‘సాహో’ టీజర్ ఎఫెక్ట్: బాలీవుడ్ సైతం అసూయపడాల్సిందే! | actioncutok.com

More for you: