‘ప్రేమమ్’ హీరోయిన్‌తో ‘ప్రేమమ్’ హీరో?

‘ప్రేమమ్’ హీరోయిన్‌తో ‘ప్రేమమ్’ హీరో?
‘ప్రేమమ్’ (2015).. మలయాళ చిత్ర పరిశ్రమలో ఇండస్ట్రీ హిట్‌గా నిలచిన ఫీల్ గుడ్ రొమాంటిక్ ఎంటర్టైనర్. తెలుగులోనూ అదే పేరుతో రీమేక్ అయిన ‘ప్రేమమ్’.. ఇక్కడా విజయ కేతనం ఎగరవేసింది. కట్ చేస్తే.. ‘ప్రేమమ్’ మలయాళ వెర్షన్లో మెయిన్ హీరోయిన్గా నటించిన సాయిపల్లవి, ‘ప్రేమమ్’ తెలుగు వెర్షన్లో హీరోగా నటించిన నాగచైతన్య.. ఇప్పుడు ఒకే సినిమాలో నటించేందుకు రంగం సిద్ధమవుతోంది.
ఆ డిటైల్స్‌లోకి వెళితే, రెండేళ్ళ క్రితం విడుదలైన బ్లాక్‌బస్టర్ మూవీ ‘ఫిదా’ తరువాత మరో చిత్రాన్ని తెరకెక్కించని శేఖర్ కమ్ముల.. ఆ మధ్య నూతన తారాగణంతో ఓ సినిమా చేయబోతున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే, కొన్ని కారణాల వల్ల ఆ ప్రాజెక్ట్ డీలే కావడంతో, ఈ గ్యాప్‌లో మరో సినిమాని ప్లాన్ చేసుకుంటున్నాడట శేఖర్.
ఈ చిత్రంలోనే ‘ప్రేమమ్’ డిఫరెంట్ వెర్షన్స్ లో హీరో, హీరోయిన్గా నటించిన చైతూ, సాయిపల్లవి జోడీగా నటించబోతున్నారట. ఆగస్టులో పట్టాలెక్కే దిశగా ప్లానింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాని.. దిల్ రాజు నిర్మించనున్నాడని సమాచారం. మరి.. ‘ప్రేమమ్’, ‘ఫిదా’ స్టార్స్, టెక్నీషియన్ల కాంబినేషన్లో రానున్న ఈ చిత్రం కూడా అదే బాటలో వెళుతుందేమో చూడాలి.
‘ప్రేమమ్’ హీరోయిన్‌తో ‘ప్రేమమ్’ హీరో? | actioncutok.com
More for you: