ఒక్కరు కాదు.. నలుగురితో రొమాన్స్ చేస్తానంటున్నాడు!


ఒక్కరు కాదు.. నలుగురితో రొమాన్స్ చేస్తానంటున్నాడు!
Sai Tej

ఒక్కరు కాదు.. నలుగురితో రొమాన్స్ చేస్తానంటున్నాడు!

అర‌డ‌జ‌ను ఫ్లాపుల త‌రువాత‌.. ‘చిత్ర‌ల‌హ‌రి’తో ఊర‌ట పొందాడు సాయితేజ్‌. ఈ నేప‌థ్యంలో.. త‌న నెక్ట్స్ ప్రాజెక్ట్‌ని ద‌ర్శ‌కుడు మారుతితో సెట్ చేసుకున్నాడు ఈ యంగ్ హీరో. ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌గా తెర‌కెక్కుతున్న ఈ సినిమాకి ‘ప్ర‌తి రోజూ పండ‌గే’, ‘భోగి’ వంటి పేర్లు వినిపిస్తున్నాయి.

ఇదిలా ఉంటే.. ఈ సినిమాలో సాయితేజ్ ప్లే బోయ్ త‌ర‌హా పాత్ర‌లో క‌నిపిస్తాడ‌ట‌. అంతేకాదు, వెంక‌టేశ్ హీరోగా రూపొందిన ‘ప్రేమ‌తో..రా!’ త‌ర‌హాలో న‌లుగురు అమ్మాయిల‌తో రొమాన్స్ చేస్తాడ‌ని టాక్‌. వారిలో ఒక‌రిగా ‘నేల టిక్కెట్టు’ ఫేమ్ మాళ‌వికా శ‌ర్మ ఇప్ప‌టికే ఎంపిక కాగా.. మ‌రో ముగ్గురు క‌థానాయిక‌ల కోసం అన్వేష‌ణ సాగుతోంది. క‌ల‌ర్‌ఫుల్‌గా సాగే ఈ సినిమా కోసం స్టైలిష్ లుక్స్‌లో స‌రికొత్త‌గా క‌నిపిస్తాడ‌ట తేజు.

కాగా, త‌మ‌న్ సంగీత‌మందిస్తున్న ఈ చిత్రం అతి త్వ‌ర‌లోనే ప‌ట్టాలెక్క‌నుంది. గీతా ఆర్ట్స్‌, యూవీ క్రియేష‌న్స్ సంస్థ‌లు ఈ ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్‌ని టేక‌ప్ చేస్తున్నాయి. మ‌రి.. ఈ చిత్రంతోనైనా మారుతి బౌన్స్ బ్యాక్ అవుతాడేమో చూద్దాం.

ఒక్కరు కాదు.. నలుగురితో రొమాన్స్ చేస్తానంటున్నాడు! | actioncutok.com

More for you: