‘భారత్’తో స‌ల్మాన్ రేర్ రికార్డ్‌!


‘భారత్’తో స‌ల్మాన్ రేర్ రికార్డ్‌!

‘భారత్’తో స‌ల్మాన్ రేర్ రికార్డ్‌!

బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ కొత్త సినిమా విడుదలైందంటే చాలు.. బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురుస్తుంది. ఈ నేప‌థ్యంలోనే, తాజాగా విడుదలైన ‘భారత్’తో మ‌రోసారి క‌లెక్ష‌న్ల విష‌యంలో త‌న‌కు తిరుగులేద‌నిపించుకుంటున్నాడు స‌ల్లూ భాయ్‌. కొరియన్ ఫిలిమ్‌ ‘ఓడ్‌ టు మై ఫాదర్’కు రీమేక్‌గా రూపొందిన ‘భారత్’కు అలీ అబ్బాస్ జాఫర్ దర్శకత్వం వహించాడు. ఈద్ సందర్భంగా ఈ నెల   5న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ.. ఇంతవరకు బాలీవుడ్‌లో ఏ హీరోకి సాధ్యం కాని ఓ అసాధారణ ఘనతను సల్మాన్ సొంతం చేసింది.

అదేమిటంటే, విడుదలైన తొలి రోజే దాదాపు రూ.45 కోట్లను టచ్ చేసిన ఈ చిత్రం.. శుక్రవారం వరకు రమారమి రూ.93 కోట్ల నెట్‌ను సాధించిందని సమాచారం. ఇక శనివారం మధ్యాహ్నానికే రూ.100 కోట్ల క్లబ్‌లో చేరిపోయిన ఈ సినిమా.. శనివారం రాత్రికి దాదాపు రూ.118 కోట్ల వసూళ్లను ఆర్జించిందని ట్రేడ్ పండితుల అంచ‌నా. ఇప్పటికే వరుసగా 13 సార్లు (‘దబాంగ్’, ‘రెడీ’, ‘బాడీగార్డ్’, ‘ఏక్‌ థా టైగర్’, ‘దబాంగ్ 2’, ‘జయహో’, ‘కిక్’, ‘భజరంగి భాయిజాన్’, ‘ప్రేమ్ రతన్ ధన్ పాయో’, ‘సుల్తాన్’, ‘ట్యూబ్ లైట్’, ‘టైగర్ జిందా హై’, ‘రేస్ 3’) రూ.100 కోట్ల మార్కును అందుకున్న సల్మాన్.. తాజాగా ‘భారత్’తో 14వ సారి ఈ ఫీట్‌ను సాధించి..  ఈ విష‌యంలో  ఫస్ట్ బాలీవుడ్ హీరోగా చరిత్ర సృష్టించాడు.

కాగా, మిశ్రమ స్పందన వచ్చిన సినిమాకే కలెక్షన్స్ ఇలా ఉంటే.. ఇక పాజిటివ్ టాక్ తెచ్చుకుని ఉంటే వసూళ్లు ఏ స్థాయిలో ఉండేవోనని ట్రేడ్ విశ్లేషకులు అభిప్రాయ‌ప‌డుతున్నారు. మ‌రి.. మున్ముందు భార‌త్‌ ఇంకెన్ని రికార్డుల‌కు కేంద్ర‌బిందువుగా నిలుస్తుందో చూద్దాం.

‘భారత్’తో స‌ల్మాన్ రేర్ రికార్డ్‌! | actioncutok.com

More for you: