సమంత – రామ్ సినిమా ఆగిపోయింది!


సమంత - రామ్ సినిమా ఆగిపోయింది!

సమంత – రామ్ సినిమా ఆగిపోయింది!

రామ్, సమంత ఇంతవరకు జోడీగా నటించలేదు. అయితే ఎనిమిదేళ్ల క్రితం ఆ ఇద్దరూ కలిసి నటించే అవకాశం వచ్చింది కానీ, అది వాస్తవ రూపం దాల్చలేదు. వివరాల్లోకి వెళ్తే.. రామ్, సమంత జంటగా నిర్మాత బెల్లంకొండ సురేశ్ ఒక సినిమా ప్లాన్ చేశారు. ‘ఏ మాయ చేశావే’ సినిమాతో సమంతను టాలీవుడ్‌కు పరిచయం చేసిన గౌతం మీనన్ ఆ సినిమాని డైరెక్ట్ చెయ్యడానికి అంగీకరించారు. సీనియర్ ప్రొడ్యూసర్ స్రవంతి రవికిశోర్ ఆ సినిమాకి సమర్పకులుగా వ్యవహరించేందుకు ముందుకువచ్చారు. దీనికి సంబంధించి 2011 ఏప్రిల్‌లో బెల్లంకొండ సురేశ్ అధికారికంగా ప్రకటించారు. ఆ సినిమాకు ఎ.ఆర్. రెహమాన్ సంగీతం అందిస్తున్నారని కూడా ఆయన చెప్పారు.

“ఓ అద్భుత కథతో గౌతం మీనన్ ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నరు. ఈ సబ్జెక్టు చాలా ఆసక్తికరంగా, ఉత్కంఠభరితంగా ఉంటుంది. కథ వినగానే రామ్ ఎంతో ఎగ్జైటై వెంటనే చేద్దామన్నాడు. గౌతం మీనన్ తీసిన ‘ఏ మాయ చేశావే’తో స్టార్ అయిన సమంత ఈ చిత్రంతో మరింత మంచి పేరు తెచ్చుకుంటుంది. రెహమాన్ సంగీతం ఈ చిత్రానికి ప్రాణం. ఇప్పటికే రెండు పాటల రికార్డింగ్ పూర్తయింది. మేలో ముహూర్తం జరిపి, జూన్ నుంచి రెగ్యులర్ షూటింగ్ జరుపుతాం” అని బెల్లంకొండ సురేశ్ చెప్పారు.

ఆయన మాటల్ని బట్టి రెహమాన్ ఈ సినిమాకి కొన్ని బాణీలు కూడా కూర్చారని తెలుస్తోంది. కానీ ఈ సినిమా సెట్స్ మీదకు రాకుండానే ఆగిపోయింది. సురేశ్ అప్పటికే రామ్ హీరోగా ‘కందిరీగ’ సినిమా చేస్తున్నారు. ఆ సినిమా తర్వాత మళ్లీ సురేశ్ బేనర్‌లో రామ్ పనిచెయ్యలేదు కానీ సమంత మాత్రం ‘అల్లుడు శీను’ సినిమా చేసింది. ఆ సినిమాతోటే సురేశ్ కొడుకు శ్రీనివాస్ హీరోగా పరిచయమైన సంగతి తెలిసిందే.

సమంత – రామ్ సినిమా ఆగిపోయింది! | actioncutok.com

More for you: