కీర్తి కంటే సామ్‌కే ఎక్కువా?


కీర్తి కంటే సామ్‌కే ఎక్కువా?

కీర్తి కంటే సామ్‌కే ఎక్కువా?

పెళ్ళ‌యినా స‌మంత క్రేజ్ ఏ మాత్రం త‌గ్గ‌లేదు. ‘రంగ‌స్థ‌లం’, ‘మ‌జిలీ’ చిత్రాల ఫ‌లితాలే ఇందుకు నిద‌ర్శ‌నం. అంతేకాదు.. పారితోషికం విష‌యంలోనూ ఈ ముద్దుగుమ్మ ముందంజ‌లో ఉంద‌న్న‌ది టాలీవుడ్ టాక్‌. ఇంత క్రేజ్ ఉంది కాబ‌ట్టే.. ఓ 5 నిమిషాల అతిథి పాత్ర‌కి కూడా ఈ అమ్మ‌డు భారీగానే డిమాండ్ చేసింద‌ట‌.  ఇంకా చెప్పాలంటే.. అదే సినిమాలో 20 నిమిషాల పాత్ర‌లో క‌నిపించ‌నున్న మ‌రో క్రేజీ హీరోయిన్ కంటే ఈ అమ్మ‌డి  రెమ్యూన‌రేష‌నే ఎక్కువ అని తెలిసింది.

వివ‌రాల్లోకి వెళితే.. నాగార్జున‌, ర‌కుల్ ప్రీత్ సింగ్ జంట‌గా ‘మ‌న్మ‌థుడు 2’ పేరుతో ఓ సినిమా రూపొందుతున్న సంగ‌తి తెలిసిందే. రాహుల్ ర‌వీంద్ర‌న్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ చిత్రంలో స‌మంత‌, కీర్తి సురేశ్ అతిథి పాత్ర‌ల్లో క‌నిపించ‌నున్నారు.  సామ్‌ది 5 నిమిషాల గెస్ట్ రోల్ అయితే.. కీర్తిది 20 నిమిషాల పాత్ర అని ఇన్‌సైడ‌ర్స్ ఇన్‌ఫ‌ర్మేష‌న్‌. అంతేకాదు.. ఈ పాత్ర‌ల కోసం ఈ ఇద్ద‌రికి భారీ పారితోషిక‌మే ముట్టింద‌ని తెలిసింది.

సామ్ రూ.35 ల‌క్ష‌ల మొత్తం పుచ్చుకుంటే.. కీర్తి పాతిక ల‌క్ష‌ల  పారితోషికం అందుకుందట‌. అంటే.. నిడివి ప‌రంగా కీర్తి పోషిస్తున్న పాత్ర పెద్ద‌దే అయినా.. చిన్న పాత్ర చేస్తున్న సామ్‌కే పెద్ద మొత్తం అందింద‌న్న‌మాట‌. దీన్నిబ‌ట్టే చెప్పొచ్చు.. ఎందరు తార‌లు వ‌చ్చినా, క్రేజ్ తెచ్చుకున్నా.. స‌మంత రేంజ్‌, క్రేజే వేర‌ని!

కీర్తి కంటే సామ్‌కే ఎక్కువా? | actioncutok.com

More for you: