మ‌రోసారి భ‌య‌పెట్ట‌నున్న సామ్‌?


మ‌రోసారి భ‌య‌పెట్ట‌నున్న సామ్‌?
Samantha Akkineni

మ‌రోసారి భ‌య‌పెట్ట‌నున్న సామ్‌?

ఆ మ‌ధ్య వాణిజ్య చిత్రాల కథానాయికగా వరుస విజయాలను ఆస్వాదించిన‌ సమంత.. ఇప్పుడు  కేవ‌లం నాయికా ప్రాధాన్యమున్న సినిమాలలో  నటించేందుకు ఆసక్తి కనబరుస్తోంది. గతంలో ‘రాజుగారి గది 2’, ‘యూ టర్న్’ వంటి హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీస్‌లో నటించి విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు పొందిన సామ్.. ప్రస్తుతం మరో ఫీమేల్ సెంట్రిక్ ఫిలిమ్‌ ‘ఓ బేబీ’తో ప్రేక్షకులను పలకరించడానికి సిద్ధంగా ఉంది.  కాగా, ‘ఓ బేబీ’ విడుదల కాకముందే.. తమిళంలో నాయికా ప్రాధాన్యమున్న సినిమాలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు కోలీవుడ్ టాక్.

ఆ వివరాల్లోకి వెళితే..  నయనతారతో ‘డోరా’ వంటి చిత్రాన్ని రూపొందించిన ద‌ర్శ‌కుడు దాస్ రామస్వామి.. సామ్ కోసం ఓ కథను సిద్ధం చేసాడట. హారర్ నేపథ్యంలో సాగే ఈ కథ సామ్‌కు బాగా నచ్చడంతో  వెంట‌నే ఓకే చెప్పినట్టు స‌మాచారం. త్వరలో ఈ సినిమాకు సంబంధించి పూర్తి వివ‌రాలు వెల్ల‌డి కానున్నాయి.

గ‌తంలో ‘రాజుగారి గది 2’ వంటి హారర్ మూవీతో ఆక‌ట్టుకున్న సామ్.. ఇప్పుడు ఈ త‌మిళ హారర్ సినిమాతో ఏ మేరకు అల‌రిస్తుందో చూడాలి. ఇదిలా ఉంటే.. సామ్ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన ‘ఓ బేబీ’ జూలై 5న ప్రేక్షకుల ముందుకు రాగా.. ఆమె కీలక పాత్ర పోషిస్తున్న‌ ‘మన్మథుడు 2’, హీరోయిన్‌గా నటిస్తున్న తమిళ రీమేక్  ‘96’ షూటింగ్ దశలో ఉన్నాయి.

మ‌రోసారి భ‌య‌పెట్ట‌నున్న సామ్‌? | actioncutok.com

More for you: