పాత్ర మార‌లేదు.. కథ మారింది!


పాత్ర మార‌లేదు.. కథ మారింది!
Balakrishna

పాత్ర మార‌లేదు.. కథ మారింది!

‘జై సింహా’ త‌రువాత బాల‌కృష్ణ‌, కె.య‌స్‌.ర‌వికుమార్ కాంబినేష‌న్‌లో మ‌రో సినిమా రాబోతున్న సంగ‌తి తెలిసిందే. సి.క‌ల్యాణ్ నిర్మిస్తున్న ఈ చిత్రం ఇటీవ‌లే పూజా కార్య‌క్ర‌మాలు జ‌రుపుకుంది. జూలై నుంచి రెగ్యుల‌ర్ షూటింగ్‌కి సిద్ధ‌మ‌వుతోంది.

ఇదిలా ఉంటే, ఈ సినిమాకి సంబంధించి ఓ ఆస‌క్తిక‌ర‌మైన విష‌యం తెలిసింది. అదేమిటంటే.. ఈ చిత్రానికి రెండు నెల‌ల కింద‌ట అనుకున్న క‌థ‌, ఇప్పుడు దృశ్య రూపం దాల్చుతున్న‌ క‌థ పూర్తిగా వేర‌ట‌. అయితే, క‌థానాయ‌కుడి పాత్ర మాత్రం మార‌లేద‌ట‌. ర‌వికుమార్ మొద‌ట చెప్పిన క‌థ రెండు నెల‌ల క్రితం నాటి రాజ‌కీయ ప‌రిస్థితుల‌కు అనుగుణంగా ఉంటే.. ఇప్ప‌టి స్క్రిప్ట్ కేవ‌లం హీరో పాత్రను అలాగే ఉంచేసి మిగిలిన పాత్ర‌లు, క‌థా శైలిని మార్చేసి త‌యారుచేసుకున్న‌ద‌ట‌.

మ‌రి.. క‌థ మారి, పాత్ర మాత్రం అలాగే ఉండిపోయిన ఈ చిత్రంతో బాల‌య్య‌, ర‌వికుమార్ కాంబినేష‌న్.. ఏ స్థాయి విజ‌యాన్ని సాధిస్తుందో తెలియాలంటే వ‌చ్చే ఏడాది సంక్రాంతి వ‌ర‌కు వేచి చూడాల్సిందే.

పాత్ర మార‌లేదు.. కథ మారింది! | actioncutok.com

More for you: