‘ద లయన్ కింగ్’కి డబ్బింగ్ చెప్పిన తండ్రీ కొడుకులు


‘ద లయన్ కింగ్’కి డబ్బింగ్ చెప్పిన తండ్రీ కొడుకులు

‘ద లయన్ కింగ్’కి డబ్బింగ్ చెప్పిన తండ్రీ కొడుకులు

‘ద ల‌య‌న్ కింగ్‌’.. 1994లో చారిత్ర‌క విజ‌యం సాధించిన  అమెరిక‌న్ యానిమేట‌డ్ మ్యూజిక‌ల్ ఫిల్మ్‌. వాల్ట్ డిస్నీ పిక్చ‌ర్స్ సంస్థ నిర్మించిన‌ ఈ చిత్రం.. పాతికేళ్ళ త‌రువాత అదే పేరుతో రీమేక్ అయ్యింది. ఈ సారి యానిమేటెడ్ ఫిల్మ్‌లా కాకుండా.. లైవ్ యాక్షన్ మూవీగా రాబోతోంది.  ‘ద జంగిల్ బుక్’, ‘ఐరన్ మాన్’ చిత్రాల ద‌ర్శ‌కుడు జాన్ ఫేవరోవ్ ఈ సినిమాని రూపొందించాడు. జూలై 19న ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఈ చిత్రం విడుద‌ల కానుండ‌గా.. భార‌త‌దేశంలో ప‌లు భాష‌ల్లో ఈ మ్యూజిక‌ల్ డ్రామా ఫిల్మ్ అదే రోజున తెర‌పైకి రానుంది.

కాగా, ఈ సినిమా హిందీ వెర్ష‌న్‌కి సంబంధించి.. లయన్ కింగ్ ముఫాసా పాత్ర‌కి షారుఖ్ ఖాన్‌ డ‌బ్బింగ్ చెప్ప‌గా, కొడుకు సింబా పాత్ర‌కి ఆయ‌న‌ త‌న‌యుడు ఆర్య‌న్ గాత్ర దానం చేయ‌డం వార్త‌ల్లో నిలుస్తోంది. అయితే.. షారుఖ్, ఆర్యన్ క‌ల‌సి గాత్ర దానం చేయ‌డం ఇదే తొలిసారి కాదు. గ‌తంలోనూ ‘ది ఇన్‌క్రెడిబుల్స్‌’(2004) చిత్రానికి ఈ ఇద్ద‌రూ గాత్ర దానం చేశారు. 

మొత్తానికి 15 ఏళ్ళ సుదీర్ఘ విరామం త‌రువాత‌ తెరవెనక  మ‌ళ్ళీ ఈ తండ్రీకొడుకులు ఒకే సినిమాకు కలసి పనిచేయడం విశేష‌మనే చెప్పాలి. తెర‌వెనుక రెండు సార్లు క‌ల‌సి ప‌నిచేసిన ఈ ఇద్ద‌రూ.. తెర‌పై క‌ల‌సి సంద‌డి చేసే రోజులు ఎప్పుడు వ‌స్తాయో చూడాలి మ‌రి.

‘ద లయన్ కింగ్’కి డబ్బింగ్ చెప్పిన తండ్రీ కొడుకులు | actioncutok.com

More for you: