షారుఖ్‌తో హిరాణీ లవ్ స్టోరీ: ఇది కదా కాంబినేషన్ అంటే!


షారుఖ్‌తో హిరాణీ లవ్ స్టోరీ: ఇది కదా కాంబినేషన్ అంటే!
Shahrukh Khan and Rajkumar Hirani

షారుఖ్‌తో హిరాణీ లవ్ స్టోరీ: ఇది కదా కాంబినేషన్ అంటే!

షారుఖ్ ఖాన్.. జయాప‌జ‌యాలకు అతీతంగా కెరీర్‌ను కొనసాగిస్తున్న బాలీవుడ్ స్టార్‌. గతేడాది ‘జీరో’ అంటూ మరుగుజ్జు పాత్రలో ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ స్టార్ హీరో.. ఇంతవరకు తన అప్‌కమింగ్ ప్రాజెక్ట్‌కు సంబంధించి ఎటువంటి అనౌన్స్‌మెంట్‌ చేయలేదు.   ప్రస్తుతం చైనాలో ఉన్న షారుఖ్  ఇండియాకి రాగానే తన తదుపరి చిత్రాన్ని  ప్రకటించనున్నట్టు బాలీవుడ్ వ‌ర్గాల భోగట్టా. అంతేకాదు, ఈ సినిమాను సూపర్ స‌క్సెస్‌ఫుల్ డైరెక్ట‌ర్ రాజ్‌కుమార్ హిరాణీ రూపొందించ‌నున్న‌ట్లు బాలీవుడ్ చిత్ర వ‌ర్గాల్లో వినిపిస్తున్న టాక్.

ఇప్పటికే, రాజ్‌కుమార్ హిరాణీ ఓ డిఫ‌రెంట్ లవ్ స్టోరీను షారుఖ్‌కు వినిపించాడనీ.. అనేక చర్చలానంతరం ఆ కథనే ఫైనలైజ్ చేసారని స‌మాచారం. ఇంతవరకు, దర్శకుడిగా తన చిత్రాలను ప్రముఖ నిర్మాత విధువినోద్ చోప్రా నిర్మాణంలో సంయుక్తంగా తెరకెక్కించిన రాజ్ కుమార్.. ఇప్పుడు షారుఖ్‌తో చేయబోయే ఈ లవ్ స్టోరీని మాత్రం తన సొంత బ్యానర్ అయిన రాజ్‌కుమార్ హిరాణీ ఫిలిమ్స్ ప‌తాకంపైనే స్వయంగా నిర్మించనున్నాడట.  ఇంతవరకు డైరెక్టర్‌గా, ప్రొడ్యూస‌ర్‌గా ఫెయిల్యూర్ అన్నదే లేని హిరాణీ.. తొలిసారి షారుఖ్‌తో చేయబోయే ఈ సినిమాతో ఎటువంటి సంచలనాల‌ను సృష్టిస్తాడో మ‌రి.  ఈ చిత్రానికి సంబంధించి త్వరలోనే మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉంది. 

‘చెన్నై ఎక్స్‌ప్రెస్’ (2013) త‌రువాత స‌రైన విజ‌యం లేని షారుఖ్‌కి రాజ్‌కుమార్ కాంబినేష‌న్ మూవీతో అయినా స‌క్సెస్ వ‌రిస్తుందా?.. అన్న‌ది ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారింది. అందునా.. రొమాంటిక్ ఎంట‌ర్‌టైన‌ర్‌ల‌కు పెట్టింది పేరైన కింగ్ ఖాన్‌.. ఈ ల‌వ్ స్టోరీతో అయినా బౌన్స్ బ్యాక్ అవుతాడేమో చూద్దాం.

షారుఖ్‌తో హిరాణీ లవ్ స్టోరీ: ఇది కదా కాంబినేషన్ అంటే! | actioncutok.com

More for you: