శర్వానంద్ ‘శ్రీకారం’ చుట్టాడు


శర్వానంద్ 'శ్రీకారం' చుట్టాడు

శర్వానంద్ ‘శ్రీకారం’ చుట్టాడు

శర్వానంద్ కథానాయకుడిగా ‘శ్రీకారం’ అనే కొత్త సినిమా నిర్మాణ కార్యక్రమాలు ఆదివారం మొదలయ్యాయి. కిశోర్ రెడ్డి దర్శకత్వంలో 14 రీల్స్ ప్లస్ పతాకంపై రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

ఆదివారం హైదరాబాద్ లో జరిగిన కార్యక్రమంలో హీరో శర్వానంద్ పై చిత్రీకరించిన ముహూర్తపు ‌‌‌‌‌‌‌షాట్ కు డైరెక్టర్ సుకుమార్ క్లాప్ కొట్టగా, శశికాంత్ వల్లూరి కెమెరా స్విచ్చాన్ చేశారు. రైటర్ బుర్రా సాయిమాధవ్ స్క్రిప్ట్ అందజేశారు.

హీరోయిన్, ఇతర తారాగణం ఎంపిక జరుగుతున్న ఈ సినిమా ఆగస్టులో సెట్స్ పైకి వెళ్లనుంది. 2020 సంక్రాంతికి విడుదల చేయాలనేది నిర్మాతల సంకల్పం.

శర్వానంద్ ‘శ్రీకారం’ చుట్టాడు | actioncutok.com

More for you: