మరోసారి బాలయ్య, శ్రియ జోడీ?

మరోసారి బాలయ్య, శ్రియ జోడీ?
కథానాయికగా శ్రియది 18 ఏళ్ళ నటనాప్రస్థానం. పదేళ్ళపాటు ఒక హీరోయిన్ కెరీర్ కొనసాగడమే కష్టమైపోయిన ఈ రోజుల్లో.. 18 ఏళ్ళు నాయికగా నటించడం అంటే అది కచ్చితంగా అభినందనీయ విషయమే. అంతేకాదు, గత ఏడాది వివాహ బంధంలోకి అడుగుపెట్టినా.. శ్రియకి అవకాశాల పరంగా ఎలాంటి లోటు లేదనే చెప్పాలి. ఈ నేపథ్యంలో.. తాజాగా చంద్రశేఖర్ యేలేటి రూపొందించనున్న ఫీమేల్ సెంట్రిక్ ఫిల్మ్‌లో నటించే అవకాశం అందుకున్న శ్రియకి.. మరో క్రేజీ ప్రాజెక్ట్‌లో నటించే ఛాన్స్ దక్కిందని టాలీవుడ్ టాక్.
ఆ డిటైల్స్‌లోకి వెళితే, ‘జై సింహా’ తరువాత సీనియర్ హీరో బాలకృష్ణ, దర్శకుడు కె.ఎస్.రవికుమార్ కాంబినేషన్లో మరో చిత్రం రానున్న విషయం విదితమే. ఈ సినిమాలో ఇద్దరు కథానాయికలకు స్థానముండగా.. అందులో ఒకరిగా శ్రియను ఎంపిక చేసినట్టు సమాచారం. ఇదివరకు బాలయ్య, శ్రియ జంటగా ‘చెన్నకేశవరెడ్డి’, ‘గౌతమిపుత్ర శాతకర్ణి’, ‘పైసా వసూల్’ చిత్రాలు వచ్చాయి. అలాగే బాలకృష్ణ డ్రీమ్ ప్రాజెక్ట్ ‘యన్టీఆర్’ బయోపిక్ తొలి భాగం ‘యన్టీఆర్ కథానాయకుడు’లోనూ శ్రియ అతిథి పాత్రలో మెరిసింది.
మరి.. ఐదోసారి బాలయ్యతో ఆడిపాడనున్న శ్రియ.. ఈ సారి ఎలాంటి ఫలితం అందుకుంటుందో చూడాలి. కాగా, 2020 సంక్రాంతికి బాలయ్య, రవికుమార్ కాంబినేషన్ మూవీ రిలీజ్ కానుంది.
మరోసారి బాలయ్య, శ్రియ జోడీ? | actioncutok.com
More for you: