మళ్లీ తల్లవుతున్న శ్రియ!

మళ్లీ తల్లవుతున్న శ్రియ!
ఒకటిన్నర దశాబ్దానికి పైగా కథానాయికగా అలరించిన శ్రియ.. అడపాదడపా అభినయానికి ప్రాధాన్యమున్న పాత్రల్లోనూ మురిపించింది. ఇష్టం, సంతోషం, నువ్వే నువ్వే, నేనున్నాను, మనం, గౌతమీపుత్ర శాతకర్ణి వంటి చిత్రాల్లో గుర్తుండిపోయే అభినయం ప్రదర్శించిన శ్రియ.. పెళ్ళయ్యాక కాస్త జోరు తగ్గించింది. అయితే, మళ్ళీ ఇప్పుడిప్పుడే సినిమాలతో బిజీ అయ్యే దిశగా అడుగులు వేస్తోందీ సొగసరి.
తాజా సమాచారం ప్రకారం.. చంద్రశేఖర్ యేలేటి రూపొందించనున్న ఓ ఫీమేల్ సెంట్రిక్ ఫిల్మ్‌లో నటించేందుకు శ్రియ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించనున్న ఈ కాన్సెప్ట్ ఓరియెంటెడ్ మూవీలో పదేళ్ళ అమ్మాయికి తల్లిగా కనిపించనుందట ఈ టాలెంటెడ్ బ్యూటీ. అంతేకాదు, శ్రియ కెరీర్లో గుర్తుండిపోయేలా ఈ పాత్ర ఉంటుందని సమాచారం.
తల్లి పాత్రల్లో శ్రియ నటించడం ఇదే తొలిసారి కాదు. ‘మనం’, ‘గోపాల గోపాల’, ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ వంటి తెలుగు చిత్రాలతో పాటు ‘దృశ్యం’ హిందీ వెర్షన్లోనూ శ్రియ అమ్మ పాత్రల్లో ఒదిగిపోయింది. తల్లిగా నటించిన ప్రతి సందర్భంలోనూ మంచి ఫలితాన్నే చూసిన శ్రియకు.. కొత్త పాత్ర కూడా పేరు తీసుకువస్తుందేమో చూడాలి. త్వరలోనే ఈ ప్రాజెక్ట్‌పై మరింత క్లారిటీ వస్తుంది.
మళ్లీ తల్లవుతున్న శ్రియ! | actioncutok.com
More for you: