‘దే దే ప్యార్ దే’ రీమేక్ పగ్గాలు ఆ ఫ్లాప్ డైరెక్టర్ చేతికేనా?


'దే దే ప్యార్ దే' రీమేక్ పగ్గాలు ఆ ఫ్లాప్ డైరెక్టర్ చేతికేనా?
Venkatesh and Sriwass

‘దే దే ప్యార్ దే’ రీమేక్ పగ్గాలు ఆ ఫ్లాప్ డైరెక్టర్ చేతికేనా?

హిందీనాట వ‌సూళ్ళ వ‌ర్షం కురిపిస్తున్న ‘దే దే ప్యార్ దే’ (అజ‌య్ దేవ‌గ‌ణ్‌, ర‌కుల్ ప్రీత్ సింగ్‌, ట‌బు ప్ర‌ధాన తారాగ‌ణం) చిత్రాన్ని.. తెలుగులో రీమేక్ చేయ‌నున్న సంగ‌తి తెలిసిందే. అజ‌య్ దేవ‌గ‌ణ్ పాత్ర‌లో వెంక‌టేశ్ న‌టించ‌బోతున్నాడు. వెంకీ సొంత నిర్మాణ సంస్థ సురేశ్ ప్రొడ‌క్ష‌న్స్ ఇప్ప‌టికే ఈ చిత్రానికి సంబంధించిన రీమేక్ హ‌క్కుల‌ను పొందింద‌ని స‌మాచారం.

కాగా, ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హించే అవ‌కాశం.. అర‌డ‌జ‌ను చిత్రాల అనుభ‌వం ఉన్న శ్రీ‌వాస్‌కి ద‌క్కింద‌ట‌.  అంతేకాదు, ఇప్ప‌టికే తెలుగు నేటివిటికి త‌గ్గ‌ట్టు శ్రీ‌వాస్ మార్పుచేర్పులు చేస్తున్నాడ‌ని తెలిసింది. ‘ల‌క్ష్యం’, ‘లౌక్యం’ మిన‌హా కెరీర్‌లో మ‌రో విజ‌యం లేని శ్రీ‌వాస్‌కి.. గ‌త రెండు చిత్రాలు (డిక్టేట‌ర్‌, సాక్ష్యం) బ్యాక్ టు బ్యాక్ స్ట్రోక్స్ ఇచ్చాయి. ఇలాంటి నేప‌థ్యంలో… ఓ ఫ్లాప్ డైరెక్ట‌ర్‌ని న‌మ్మి రిస్క్ చేస్తున్న వెంకీకి ఎలాంటి ఫ‌లితం ద‌క్కుతుందో చూడాలి మ‌రి.

‘దే దే ప్యార్ దే’ రీమేక్ పగ్గాలు ఆ ఫ్లాప్ డైరెక్టర్ చేతికేనా? | actioncutok.com

More for you: