రాజమౌళి పేరు వెనుక కథ తెలుసా?


రాజమౌళి పేరు వెనుక కథ తెలుసా?

రాజమౌళి పేరు వెనుక కథ తెలుసా?

టాలీవుడ్ టాప్ డైరెక్టర్ ఎస్.ఎస్. రాజమౌళి పూర్తిపేరు శ్రీశైల శ్రీ రాజమౌళి. ఆ పేరుని ఆయనకు తల్లిదండ్రులు ఎందుకు పెట్టారో తెలుసా? రాజమౌళే ఆ సంగతి చెప్పారు.

“నా తల్లిదండ్రులు గొప్ప శివభక్తులు. ప్రతి శివరాత్రికి వాళ్లు ఏదో ఒక జ్యోతిర్లింగాన్ని దర్శించుకుంటారు. అలా ఓసారి శ్రీశైలం వెళ్లినప్పుడు అక్కడ వచ్చిన ఒక కల తర్వాత నేను పుట్టానని మా అమ్మ చెబుతుంటుంది. ఆ కలలో తెల్లటి దుస్తుల్లో ఉన్న ఓ సాధువు వచ్చి అమ్మ చేతుల్లో ఓ బిడ్డని ఉంచాడంట. అందుకే నాకు ‘శ్రీశైల శ్రీ రాజమౌళి’ అని పేరు పెట్టారు. చిన్నతనంలో ఈ కథని నాతో పాటు మా కజిన్స్ ఉన్నప్పుడు మా అమ్మ చెప్పినప్పుడల్లా నన్ను నేను దేవుడిలా ఫీలైపోయి, గర్వంగా రొమ్ము విరుచుకునేవాడ్ని” అని చెప్పుకొచ్చారు రాజమౌళి.

ప్రస్తుతం ఆయన ‘ఆర్ ఆర్ ఆర్’ సినిమాతో బిజీగా ఉన్నారు. ఇందులో జూనియర్ ఎన్టీఆర్, రాంచరణ్, అలియా భట్, అజయ్ దేవ్‌గణ్, సముద్ర ఖని ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. 2020 జూలై 30న విడుదల కానున్నది.

రాజమౌళి పేరు వెనుక కథ తెలుసా? | actioncutok.com

More for you: