రివటలా మారిన ‘మహానటి’!


రివటలా మారిన 'మహానటి'!

రివటలా మారిన ‘మహానటి’!

మలయాళీ భామ కీర్తి సురేశ్ ఇవాళ దక్షిణాది అగ్ర తారల్లో ఒకరిగా పేరు తెచ్చుకుంది. తెలుగులో చేసిన ‘మహానటి’ ఆమె కెరీర్ దిశనే మార్చేసింది. సావిత్రి పాత్రను ఆమె పోషించిన తీరు అందర్నీ అమితంగా ఆకట్టుకుంది. కాగా ప్రస్తుతం పలు సినిమాలతో బిజీ బిజీగా ఉన్న ఆమె తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్‌లో పోస్ట్ చేసిన ఫొటోలు అందర్నీ ఆశ్చర్యపోయేలా చేశాయి. బొద్దుగా ఉండే ఆమె సన్నగా రివటలా మారి కనిపించడమే దానికి కారణం. ఇప్పుడా ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

తెలుగులో ‘నేను.. శైలజ’ సినిమా నుంచి చూసుకున్నా ఇంత సన్నగా ఆమె ఎప్పుడూ కనిపించలేదు. ఇలా ఆమె బరువు తగ్గడానికి హిందీలో చేస్తోన్న సినిమానే కారణమని తెలుస్తోంది. అజయ్ దేవగణ్ సరసన నటించనున్న ఆ స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్ సినిమా కోసమే ఆమె వర్కౌట్స్, డైట్‌తో సన్నబడిందని సమాచారం. త్వరలోనే ఆ సినిమా సెట్స్‌పైకి వెళ్తోంది.

అలాగే తెలుగులో ఆమె ఒక హీరోయిన్ ఓరిఎంటెడ్ సినిమా చేస్తోంది. ప్రస్తుతం ఆ సినిమా షూటింగ్ యు.ఎస్.లో జరుగుతోంది. దాంతో పాటు నగేశ్ కుకునూర్ తెలుగులో రూపొందిస్తున్న సినిమాలోనూ ఆమె నాయికగా చేస్తోంది.

రివటలా మారిన 'మహానటి'!

రివటలా మారిన ‘మహానటి’! | actioncutok.com

More for you: