‘సైరా’ ట్రైల‌ర్‌కి ముహూర్తం కుదిరిందా?


'సైరా' ట్రైల‌ర్‌కి ముహూర్తం కుదిరిందా?

‘సైరా’ ట్రైల‌ర్‌కి ముహూర్తం కుదిరిందా?

మెగాస్టార్ చిరంజీవి డ్రీమ్ ప్రాజెక్ట్ ‘సైరా న‌ర‌సింహారెడ్డి’. తొలి తెలుగు స్వాతంత్ర్య స‌మ‌ర యోధుడు ఉయ్యాల‌వాడ న‌ర‌సింహారెడ్డి జీవితం ఆధారంగా రూపొందుతున్న ఈ హిస్టారిక‌ల్ డ్రామాకి సురేంద‌ర్ రెడ్డి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తుండ‌గా.. రామ్ చ‌ర‌ణ్ నిర్మాత‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నాడు. అమితాబ్ బ‌చ్చ‌న్‌, న‌య‌న‌తార‌, త‌మ‌న్నా, విజ‌య్ సేతుప‌తి, జ‌గ‌ప‌తి బాబు, సుదీప్.. ఇలా భారీ తారాగ‌ణంతో తెర‌కెక్కుతున్న ఈ సినిమా చిత్రీక‌ర‌ణ తుది ద‌శ‌కు చేరుకుంది. కేవ‌లం ప్యాచ్ వ‌ర్క్ మాత్ర‌మే పెండింగ్ ఉంద‌ని, దాన్ని నెలాఖ‌రులో పూర్తిచేస్తార‌ని టాక్‌.

ఇదిలా ఉంటే, ఈ సినిమా ట్రైల‌ర్ విడుద‌ల తేదీకి సంబంధించి ఆస‌క్తిక‌ర‌మైన విష‌యం తెలిసింది. అదేమిటంటే, చిరు పుట్టిన‌రోజు సంద‌ర్భంగా ఆగ‌స్టు 22న ‘సైరా’ ట్రైల‌ర్‌ని రిలీజ్ చేస్తార‌ట‌. ఇక గాంధీ జ‌యంతి సంద‌ర్భంగా అక్టోబ‌ర్ 2న ఈ సినిమాని రిలీజ్ చేసేందుకు స‌న్నాహాలు చేస్తున్నార‌ని స‌మాచారం. త్వ‌ర‌లోనే ట్రైల‌ర్‌, రిలీజ్ డేట్‌పై అధికారిక ప్ర‌క‌ట‌న‌లు వ‌చ్చే అవ‌కాశ‌ముంది.

‘సైరా’ ట్రైల‌ర్‌కి ముహూర్తం కుదిరిందా? | actioncutok.com

More for you: