‘సైరా’ రిలీజ్ సంక్రాంతికి మారనున్నదా?


‘సైరా’ రిలీజ్ సంక్రాంతికి మారనున్నదా?

‘సైరా’ రిలీజ్ సంక్రాంతికి మారనున్నదా?

టాలీవుడ్ మోస్ట్ ఎక్జైటింగ్‌ ప్రాజెక్ట్స్‌లో ‘సైరా నరసింహారెడ్డి’ ఒకటి.  చిరంజీవి క‌థానాయ‌కుడిగా న‌టిస్తున్న‌ ఈ చిత్రం.. ఎప్పుడెప్పుడు తెర‌పైకి వ‌స్తుందా అని మెగాభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే.. వారి నిరీక్షణ ఇప్పట్లో నెరవేరేలా క‌నిపించ‌డం లేదు. వినిపిస్తున్న కథనాల ప్రకారం.. ఈ సినిమా 2019లో విడుదల అయ్యే అవకాశాలు దాదాపుగా లేవని తెలుస్తోంది.

ఆ వివరాల్లోకి వెళితే.. తొలి తెలుగు స్వాతంత్ర్య సమరయోధుడు ‘ఉయ్యాలవాడ నరసింహారెడ్డి’ జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం ‘సైరా నరసింహారెడ్డి’. దాదాపు ఒక‌టిన్న‌ర సంవ‌త్స‌ర కాలంగా చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ సినిమా ఇటీవలే చిత్రీక‌ర‌ణ‌ను పూర్తి చేసుకుంది. ఇదిలా ఉంటే.. ఈ చిత్రాన్ని గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్ 2న విడుదల చేయ‌నున్న‌ట్టు ఆ మ‌ధ్య వార్తలు వినిపించాయి.

అయితే.. విజువల్ ఎఫెక్ట్స్‌కి పెద్ద పీట వేస్తున్న ఈ మూవీ రిలీజ్‌కు సంబంధించి మ‌రికొంత జాప్యం జరిగేలా ఉందని టాక్‌. ఎందుకంటే.. ఈ సినిమా ఫ్లాష్ బ్యాక్‌లో వచ్చే సన్నివేశాలకు ఈ విజువల్ ఎఫెక్ట్స్‌ చాలా కీలకమట. ఈ విషయంలో ఎటువంటి ఛాన్స్ తీసుకోకూడదని సి.జి.ఐ టీమ్ భావిస్తోందట. అందుకే బెస్ట్ అవుట్‌పుట్ కోసం నవంబర్ నెలాఖరు వరకు టైమ్ ప‌డుతుంద‌ని సమాచారం. నిర్మాత రామ్ చరణ్ కూడా ఈ జాప్యానికి ఒకింత అసహనం వ్యక్తం చేసినా.. బెస్ట్ రిజ‌ల్ట్ కోసం సి.జి.ఐ టీమ్ అడిగినంత టైమ్‌ ఇవ్వడానికే సిద్దపడుతున్నాడని టాక్.

అంటే.. పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో భాగంగా నవంబర్ నెలాఖరు క‌ల్లా గ్రాఫిక్స్, విజువ‌ల్ ఎఫెక్ట్స్ పూర్తయితే.. ఆ తర్వాత ప్రచార కార్యక్రమాలను నిర్వహించడం వంటి కార్య‌క్ర‌మాల‌తో మ‌రికొంత టైమ్ ప‌డుతుంది. అందుకే ఈ సంవత్సరాంతంలో కాకుండా, 2020 సంక్రాంతి బరిలోనే ‘సైరా’ని విడుదల చేస్తే ఎలా ఉంటుందనే ఆలోచనలో యూనిట్ ఉన్నట్టు టాలీవుడ్ సర్కిల్స్‌లో క‌థ‌నాలు వ‌స్తున్నాయి.

మరి ఈ వార్తల్లో నిజమెంతో తెలియాలంటే ఇంకొంత కాలం ఆగాల్సిందే.

‘సైరా’ రిలీజ్ సంక్రాంతికి మారనున్నదా? | actioncutok.com

More for you: