కెరీర్‌పై తమన్నా ఆశలు


– సజ్జా వరుణ్
కెరీర్‌పై తమన్నా ఆశలు
Tamannaah

కెరీర్‌పై తమన్నా ఆశలు

టాలీవుడ్‌లో ‘నెక్స్ట్ ఏంటి?’ అనే పరిస్థితికి వచ్చిన తమన్నా భాటియాకు ‘ఎఫ్ 2’ బ్లాక్‌బస్టర్ కావడం కొత్త ఊపిరినిచ్చింది. కెరీర్‌పై ఆశలు కల్పించింది. ‘బాహుబలి’ తర్వాత, ‘ఎఫ్ 2’కి ముందు తమన్నా స్థితి టాలీవుడ్‌లో ఏమంత బాగాలేదు. అతిథి పాత్రలు, ఐటీం సాంగ్స్‌తో కాలం నెట్టుకొచ్చింది. మధ్యలో ఒక్క ‘ఊపిరి’ మాత్రమే చెప్పుకోదగ్గ సినిమా. ‘నా నువ్వే’, ‘నెక్స్ట్ ఏంటి?’ సినిమాలు డిజాస్టర్స్ అవడం, యువ అగ్ర హీరోల సినిమాల్లో అవకాశాలు లేకపోవడంతో టాలీవుడ్‌లో తమన్నా హవా ముగిసిందని అంతా అనుకున్నారు.

అనూహ్యంగా సీనియర్ స్టార్ వెంకటేశ్‌తో ‘ఎఫ్ 2’లో నటించడం ఆమెకు కలిసొచ్చింది. అందులో అందాలను యథేచ్ఛగా ఆరబోసి ప్రేక్షకులకు కనువిందు చేసింది. సినిమా విడుదలకు ముందు “వెంకటేశ్, తమన్నా జోడీనా?” అని చాలా మంది పెదవి విరిచారు. అయితే సినిమా విడుదల తర్వాత ఆ అనుమానాలన్నీ పటాపంచలయ్యాయి. ఇద్దరి జోడీని ప్రేక్షకులు మెచ్చారు. పైగా సినిమా రికార్డ్ కలెక్షన్లు సాధించడంతో తమన్నాకు ప్లస్ అయ్యింది.

ఇప్పుడు ఆమె ‘క్వీన్’ రీమేక్ ‘దటీజ్ మహాలక్ష్మి’ సినిమా విడుదల కోసం ఎదురు చూస్తోంది. షూటింగ్ పూర్తయి నెలలు గడుస్తున్నా నిర్మాతలు విడుదల చెయ్యకపోవడం ఆమెను కలవరపెడుతోంది. ఎంతో కష్టపడి ఇష్టంగా చేసిన సినిమా విడుదల సమస్యల్ని ఎదుర్కోవడం ఎవరికైనా కష్టం కలిగించే విషయమే!

కాగా మరో సినిమాపై కూడా తమన్నా ఎన్నో ఆశలు పెట్టుకుంది. అది చిరంజీవి టైటిల్ రోల్ చేస్తున్న ‘సైరా.. నరసింహారెడ్డి’. అందులో లక్ష్మి అనే కీలక పాత్ర చేసింది తమన్నా. నటిగా ‘సైరా’ తనకు మంచి పేరు తీసుకు వస్తుందనే నమ్మకంతో ఉంది. రానున్న రోజుల్లో టాలీవుడ్‌లో మరిన్ని మంచి అవకాశాలు వస్తాయనే ఆశాభావంతో ఉంది మిల్కీ బ్యూటీ.

కెరీర్‌పై తమన్నా ఆశలు | actioncutok.com

More for you: