క్రేజీ మోహన్ మరి లేరు


క్రేజీ మోహన్ మరి లేరు
Crazy Mohan

క్రేజీ మోహన్ మరి లేరు

పేరుపొందిన రంగస్థల, సినీ నటుడు, పలు తమిళ సినిమాలకు స్క్రిప్ట్ రైటర్‌గా పనిచేసిన క్రేజీ మోహన్ సోమవారం తీవ్ర గుండెపోటుతో చెన్నైలో మృతి చెందారు. ఆయన వయసు 67 సంవత్సరాలు. 1952లో జన్మించిన ఆయనకు తల్లిదండ్రులు పెట్టిన పేరు మోహన్ రంగాచారి. ‘క్రేజీ థీవ్స్ ఇన్ పలవక్కం’ అనే నాటకం తర్వాత ఆయన పేరుకు ముందు ‘క్రేజీ’ స్థిరపడిపోయింది. ఆ నాటకం తర్వాత టెలివిజన్ సీరియల్‌గానూ ప్రసారమైంది.

1970లలో మెకానికల్ ఇంజినీరింగ్ చేసిన ఆయనను నాటక రంగం ఆకర్షించింది. 1979లో క్రేజీ క్రియేషన్స్ అనే సొంత డ్రామా ట్రూప్‌ను నెలకొల్పారు. అనేక నాటకాలు ఆడాక, సినీ రంగంలోనూ అడుగుపెట్టి అనేక సినిమా స్క్రిప్టులు రాశారు. కమల్ హాసన్‌తో ప్రయాణం ఆయనకు మరింత పేరు తెచ్చింది. కమల్ హీరోగా కొన్ని హిలేరియస్ కామెడీ స్క్రిప్టులను క్రేజీ మోహన్ సమకూర్చారు.

క్రేజీ మోహన్ మరి లేరు | actioncutok.com

More for you: