మితిమీరిన సెక్స్‌తో నిషేధానికి గురైన టాప్ 10 మ్యూజిక్ వీడియోలు


– కార్తికేయ
మితిమీరిన సెక్స్‌తో నిషేధానికి గురైన టాప్ 10 మ్యూజిక్ వీడియోలు

మితిమీరిన సెక్స్‌తో నిషేధానికి గురైన టాప్ 10 మ్యూజిక్ వీడియోలు

మ్యూజిక్ వీడియోలు చూడాలంటే సంగీత ప్రియులు మొదట చూసేది ఎంటీవీనే. ఇక సంగీతకారులకు గత పదేళ్లుగా యుట్యూబ్ ప్రధాన మార్కెటింగ్ వనరుగా ఉంటూ వస్తోంది. అతి స్వల్ప కాలంలో టేలర్ స్విఫ్ట్, కేటీ పెర్రీ వంటి ఆర్టిస్టుల వీడియోలు మిలియన్ల కొద్దీ వ్యూస్ సాధించేస్తున్నాయి. ఇది వర్థమాన కళాకారులకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తోంది.

అయితే కొంతమంది కళాకారులు త్వరగా పాపులర్ అవ్వాలనే ఉద్దేశంతో మోతాదు మించిన సెక్స్‌ను ఆశ్రయిస్తున్నారు. దాంతో వివాదాలు తప్పడం లేదు. కొన్ని సందర్భాల్లో అయితే ఆ మ్యూజిక్ వీడియోలు ఆన్‌లైన్, టీవీ చానళ్లు, ఆఖరుకి అనేక దేశాల్లో నిషేధానికి గురవుతున్నాయి. అయినప్పటికీ సంగీత కళాకారులు వెరవడం లేదు. కారణం.. దానివల్ల వాళ్ల పాపులారిటీ మరింత పెరుగుతుండటం. మితి మీరిన సెక్స్‌తో ఉన్నాయంటూ నిషేధం ఎదుర్కొన్న 10 మ్యూజిక్ వీడియోలేవో చూద్దాం…

1. మడోన్నా – ‘జస్టిఫై మై లవ్’

90ల తొలినాళ్లలో సెక్స్ గాడెస్‌గా తనను తాను ప్రమోట్ చేసుకుంది మడోన్నా. దానికి ‘ఎరోటికా’ ఆల్బం, ‘సెక్స్’ అనే కాఫీ టేబుల్ బుక్ దోహదం చేశాయి. ఆమె నుంచి వచ్చిన పాపులర్ సాంగ్స్‌లో ‘జస్టిఫై మై లవ్’ ఒకటి. ఆ పాట వీడియో రసికులను అమితంగా అలరించింది. హోటల్ రూంలో ఒక స్త్రీ, ఒక పురుషుడు చేసే రకరకాల శృంగార చేష్టలతో ఆ వీడియోను రూపొందించారు. చాలామందిని షాక్‌కు గురిచేసిన ఆ బ్లాక్ అండ్ వైట్ వీడియోను ఎంటీవీ నిషేధించడంతో వీహెచ్ఎస్‌లో దాన్ని విడుదల చేసింది మడోన్నా. బెస్ట్‌సెల్లర్‌గా నమోదవడంతో పాటు యు.ఎస్.లో టాప్‌లో నిలిచిన ఆ వీడియో అనేక యూరోపియన్ కంట్రీస్‌లో టాప్ 10లో చోటు దక్కించుకుంది.

2. సర్ మిక్స్-ఎ-లాట్ – ‘బేబీ గాట్ బ్యాక్’

సన్నగా రివటలా ఉండే తారలు, మోడళ్లను అందగత్తెలుగా కీర్తించే మీడియా ట్రెండ్‌కు విరుద్ధంగా వెడల్పాటి పృష్ఠభాగం ఉన్న వాళ్లు ఆరోగ్యవంతులుగా, సెక్సీగా ఉంటారనే స్టాండ్ తీసుకుంది ‘బేబీ గాట్ బ్యాక్’. మొదట్లో ఎంటీవీలో కొంత కాలం నిషేధం ఎదుర్కొన్న ఈ 1992 నాటి మ్యూజిక్ వీడియో, ఆ తర్వాత ప్రసార అనుమతి పొంది సూపర్ పాపులర్ అయ్యింది. 2 మిలియన్ కాపీలు పైగా అమ్ముడైంది. ఆ రోజుల్లో కంటే ఈ రోజులకు ఈ వీడియోలోని సాహిత్యం మరింత నప్పుతుంది.

3. రిహానా – ‘పోర్ ఇట్ అప్’

మితిమీరిన సెక్స్‌తో నిషేధానికి గురైన టాప్ 10 మ్యూజిక్ వీడియోలు

డబ్బుతో వచ్చే ఆనందాలు ఎలా ఉంటాయో చెప్పే మ్యూజిక్ వీడియో ‘పోర్ ఇట్ అప్’ (2013). ఒక సింహాసనంపై రిహానా చేసే విన్యాసాలు, పోల్-డాన్సింగ్‌తో ఈ వీడియో కిర్రెక్కిస్తుంది. అందుకే వెవో చానల్‌లో మొదటిసారి ప్రసారమైన 10 నిమిషాలకే దాన్ని తొలగించేశారు. వివాదాస్పదమైన విన్యాసాల్ని తొలగించి ఇచ్చిన వెర్షన్ తిరిగి ఆ చానల్‌లో ప్రత్యక్షమైంది. దాంతో రిహానా అభిమానులు ఖుషీ చేసుకున్నారు. యుట్యూబ్‌లో ఇప్పటివరకు ‘పోర్ ఇట్ అప్’కు 200 మిలియన్ వ్యూస్ వచ్చాయంటే దాని పాపులారిటీ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవాల్సిందే.

4. డురాన్ డురాన్ – ‘గాళ్స్ ఆన్ ఫిల్మ్’

డురాన్ డురాన్ బ్యాండ్ తీసుకొచ్చిన ఒక పాట నిషేధానికి గురయ్యిందంటే కొంతమందికి నమ్మశక్యం కాదు. ఇప్పటికీ అది నిజం. ఆ బ్యాండ్ రూపొందించిన మోస్ట్ పాపులర్ ట్రాక్స్‌లో ‘గాళ్స్ ఆన్ ఫిల్మ్’ ఒకటి. ఆ వీడియోను బీబీసీ పూర్తిగా నిషేధించగా, దాని ఎడిటెడ్ వెర్షన్‌ను ఎంటీవీ ప్రసారం చేసింది. గ్రామీ అవార్డును సైతం పొందిన ఈ వీడియో ఎందుకు నిషేధానికి గురయింది? వీడియోలోని ఆడవాళ్లు నర్సులుగా, కౌగాళ్స్‌గా డ్రస్ చేసుకొని చేసిన శృంగారభరిత విన్యాసాలే దాని నిషేధానికి కారణం.

5. ద ప్రాడిజీ – ‘స్మాక్ మై బిచ్ అప్’

మితిమీరిన సెక్స్‌తో నిషేధానికి గురైన టాప్ 10 మ్యూజిక్ వీడియోలు

ద ప్రాడిజీ అనేది ఇంగ్లండ్‌లోని అతి పెద్ద ఎలక్ట్రానిక్ గ్రూపులలో ఒకటి. అదివరకు ‘ఫైర్‌స్టార్టర్’, ‘బ్రీత్’ వంటి మ్యూజిక్ వీడియోలతో పాపులర్ అయినప్పటికీ, ఆ బృందాన్ని ప్రపంచవ్యాప్తంగా పాపులర్ చేసిన ట్రాక్ మాత్రం ‘స్మాక్ మై బిచ్ అప్’. వివాదాస్పద సాహిత్యం, వివాదాస్పద మ్యూజిక్ వీడియో వల్లే ఆ ట్రాక్ అంత పాపులర్ అయ్యిందని చెప్పాలి. యు.కె., యు.ఎస్.లలో ఈ వీడియోను టీవీలో ప్రసారం చేయడాన్ని నిషేధించారు. అయితే అభిమానుల నుంచి వచ్చిన అనేక విజ్ఞప్తులతో ఎంటీవీ దీన్ని ప్రసారం చేసింది. అది కూడా కంటెంట్ వార్నింగ్ ఇస్తూ, అర్ధరాత్రి వేళల్లో మాత్రమే.

6. మడోన్నా – ‘ఎరోటికా’

‘జస్టిఫై మై లవ్’ తరహాలోనే ‘ఎరోటికా’ (1992)తో వివాదం సృష్టించింది మడోన్నా. సెక్సువల్ కంటెంట్ ఉన్న బ్లాక్ అండ్ వైట్ వీడియో ఈ ఆల్బంలో భాగం. ఈ వీడియోలో మడోన్నా సెక్స్ బుక్ ఫుటేజ్ కూడా ఉంది. నిషేధానికి గురికాక ముందు ఎంటీవీలో ఈ వీడియో కేవలం మూడు సార్లు.. అదీ రాత్రి 10 గంటల తర్వాతే ప్రసారమైంది. చిన్నతెరపై నిషేధం ఉన్నా కూడా, నేటికీ ‘ఎరోటికా’ అనేక దేశాల్లో టాప్ 10లో భాగంగా ఉంటోందంటే దానికున్న ఆదరణ ఏమిటో అర్థమవుతుంది.

7. రిహానా – ‘ఎస్ &ఎం’

మితిమీరిన సెక్స్‌తో నిషేధానికి గురైన టాప్ 10 మ్యూజిక్ వీడియోలు

కమర్షియల్‌గా ‘ఎస్ &ఎం’ అంట్ టైటిల్ పెట్టడం స్మార్ట్ మూవ్ అని చెప్పాలి. సెక్స్, అనుబంధం చుట్టూ తిరిగే సాహిత్యంతో ఈ పాట వీక్షకుల్ని అమితంగా ఆకట్టుకుంది. ప్లాస్టిక్ రాపింగ్ చుట్టుకొని గోడకు ఆనుకొని రిహానా కనిపించడంతో మొదలయ్యే ఈ వీడియోలో ఆద్యంతం రిహానా శారీరక ప్రదర్శన కనిపిస్తుంది. 11 దేశాల్లో ఈ వీడియో నిషేధానికి గురవగా, యుట్యూబ్ దీనికి అడల్ట్ రేటింగ్ ఇచ్చింది. అంతర్జాతీయంగా ‘ఎస్ &ఎం’ బంపర్ హిట్టయింది.

8. రాబిన్ థిక్ – ‘బ్లర్ర్‌డ్ లైన్స్’

రాబిన్ థిక్, ఫారెల్ విలియమ్స్ సంయుక్తంగా రచించి, ప్రొడ్యూస్ చేసిన ‘బ్లర్ర్‌డ్ లైన్స్’ మ్యూజిక్ వీడియో సూపర్ హిట్టయింది. దాంతో పాటు వివాదాలూ దాన్ని చుట్టుముట్టాయి. ఆ పాట సాహిత్యం స్త్రీద్వేషాన్ని వెదజల్లుతోందనీ, అత్యాచారాన్ని అది సమర్ధిస్తోందనీ విమర్శలు వెల్లువెత్తాయి. వక్షస్థలాన్ని ప్రదర్శించే టాప్‌లెస్ మోడల్స్‌తో రూపొందించిన ఈ వీడియో యుట్యూబ్‌లో వారం రోజులే దర్శనమిచ్చింది. తర్వాత దాన్ని నిషేధించారు. దాంతో ఎడిట్ చేసిన వెర్ష 2014 మార్చి నుంచి అందుబాటులో ఉంది. ఏదేమైనా 14 దేశాల్లో ఈ వీడియో నంబర్ ఒన్‌గా నిలవడం విశేషం.

9. సియారా, జస్టిన్ టింబర్‌లేక్ – ‘లవ్ సెక్స్ మ్యాజిక్’

మితిమీరిన సెక్స్‌తో నిషేధానికి గురైన టాప్ 10 మ్యూజిక్ వీడియోలు

జస్టిన్ టింబర్‌లేక్‌తో జత కలిసిన సియారా చేసిన ‘లవ్ సెక్స్ మ్యాజిక్’.. పేరుకు తగ్గట్లే హాట్ వీడియోగా పేరు పొందింది. 2009 బెస్ట్ వీడియోల్లో ఒకటిగా పేరు తెచ్చుకున్నప్పటికీ ఈ సెక్సువల్ మ్యూజిక్ వీడియోలో సియారా ధరించిన దుస్తులు, ఆమె డాన్సింగ్ మూమెంట్స్ అసభ్యకరంగా ఉన్నాయని విమర్శలు వచ్చాయి. ఇప్పటికీ ఈ వీడియోపై టర్కీలో నిషేధం కొనసాగుతోంది.

10. సియారా – ‘రైడ్’

2010లో వచ్చిన ఈ మ్యూజిక్ వీడియోలో ఎక్కువసేపు సియారా కనిపిస్తుంది. బ్యాగ్రౌండ్‌లో ఏమీ లేకుండా ఆమె చేసే డాన్స్ మూమెంట్స్‌లో అశ్లీలత పాలు ఎక్కువగా ఉందని ఆ వీడియోపై నిషేధం విధించారు. నిషేధం విధించక ముందు యు.ఎస్., యు.కె. లలో టాప్ 100 చార్టులో చోటు దక్కించుకుంది.

మితిమీరిన సెక్స్‌తో నిషేధానికి గురైన టాప్ 10 మ్యూజిక్ వీడియోలు | actioncutok.com

More for you: