జనసేనానిని అవమానించిన జనం!


జనసేనానిని అవమానించిన జనం!

జనసేనానిని అవమానించిన జనం!

జనాన్ని నమ్ముకొని తన పార్టీకి ‘జనసేన’ అని నామకరణం చేసి, జనమే తన బలంగా ఎన్నికల్లో దిగిన పవర్‌స్టార్ పవన్ కల్యాణ్‌కు ఆ జనం దిమ్మ తిరిగే షాక్ ఇచ్చారు. స్వయంగా పవన్‌ను రెండు నియోజక వర్గాల్లో ఓడించారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలోని 175 సీట్లలో ఒకే ఒక్క సీటును ఇచ్చారు.

ఆ విషయం అలా ఉంచితే.. ఒక వైపు సినిమాల్లో నటిస్తూనే, మధ్య మధ్యలో ప్రజల సమస్యలపై మాట్లాడుతూ వచ్చాడు పవన్. అవసరమైతే బాధిత జనాల వద్దకు వెళ్లి మరీ, వాళ్ల తరపున గొంతు వినిపించాడు. టీడీపీ ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చాడు. అలాంటి వాటిలో ఉద్దానంలోని కిడ్నీ బాధితుల కోసం అతను చేసిన దీక్ష ఒకటి.

శ్రీకాకుళం జిల్లాలోని ఉద్దానం ఏరియాలో వేలాది మంది కిడ్నీ సమస్యలతో బాధపడుతున్నారు. గడచిన పదేళ్లలో అక్కడ దాదాపు 5 వేల మంది కిడ్నీ సమస్యలతో మృత్యువాతపడ్డారు. మరో 35 వేల మంది కిడ్నీ వ్యాధులతో బాధపడుతున్నట్లు అంచనా. ఉద్దానం ప్రాంతానికి వెళ్లి, కిడ్నీ వ్యాధిగ్రస్తుల్ని కలుసుకొని, వాళ్లకు సరైన చికిత్స అందించాలని దీక్ష చేశాడు పవన్.

చిత్రంగా నిన్న జరిగిన ఎన్నికల్లో పవన్ కల్యాణ్ పార్టీ జనసేనను ఉద్దానం జనం చిన్న చూపు చూశారు. ఎంత చిన్నచూపు అంటే జనసేన అభ్యర్థులకు డిపాజిట్ కూడా దక్కించలేదు. అంతకు మించి కేవలం వందల సంఖ్యలోనే ఓట్లు వేసి పరాభవించారు. ఏ జనం కోసమైతే జనసేనాని పోరాడారో వాళ్లే ఆయన్ని ఎన్నికల్లో అవమానించడం చూస్తే, పవన్‌పై సానుభూతి కలుగక మానదు.

జనసేనానిని అవమానించిన జనం! | actioncutok.com

More for you: