‘సాహో’తో ఆ రికార్డు పదిలమేనా?

‘సాహో’తో ఆ రికార్డు పదిలమేనా?
విజయవంతమైన చిత్రాలకు చిరునామాగా నిలచిన సంస్థ యూవీ క్రియేషన్స్. ‘మిర్చి’ (2013)తో మొదలైన ఈ సంస్థ నిర్మాణ ప్రస్థానం.. దిగ్విజయంగా కొనసాగుతూనే ఉంది. ప్రస్తుతం తమ తొలి చిత్ర కథానాయకుడు ప్రభాస్‌తో ఈ సంస్థ నిర్మిస్తున్న ‘సాహో’ ఆగస్టు 15న విడుదలకు సిద్ధమైంది. భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్.. తెలుగుతో పాటు హిందీ, తమిళ, మలయాళ భాషల్లోనూ రిలీజ్ కానుంది. ఇటీవల విడుదలైన టీజర్ ఇంప్రెసివ్‌గా ఉండడంతో.. సినిమాపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
ఇదిలా ఉంటే, యూవీ క్రియేషన్స్ సంస్థ ట్రాక్ రికార్డు గమనిస్తే.. ఓ విషయం స్పష్టమవుతోంది. అదేమిటంటే.. ఈ సంస్థ నుంచి ప్రతీ ఏడాది ఓ విజయవంతమైన చిత్రం వస్తూనే ఉంది. 2013లో ‘మిర్చి’, 2014లో ‘రన్ రాజా రన్’, 2015లో ‘భలే భలే మగాడివోయ్’ (భాగస్వామ్యంలో), 2016లో ‘ఎక్స్‌ప్రెస్ రాజా’, 2017లో ‘మహానుభావుడు’, 2018లో ‘భాగమతి’.. ఇలా ఏడాదికో విజయం ఈ సంస్థ పేరిట ఉంది. మరి.. ఆ రికార్డును కొనసాగిస్తూ ‘సాహో’ సైతం విజయతీరాలకు చేరుకుంటుందేమో చూడాలి.
‘సాహో’తో ఆ రికార్డు పదిలమేనా? | actioncutok.com
More for you: