వాళ్లు 28 ఏళ్ల తర్వాత కలుస్తున్నారు!


వాళ్లు 28 ఏళ్ల తర్వాత కలుస్తున్నారు!
Venkatesh and Tabu

వాళ్లు 28 ఏళ్ల తర్వాత కలుస్తున్నారు!

హిందీనాట‌ విజ‌యం సాధించిన ‘దే దే ప్యార్ దే’ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేయ‌నున్న సంగ‌తి తెలిసిందే. ప్ర‌ముఖ నిర్మాత డి.సురేశ్ బాబు రీమేక్ రైట్స్‌ని సొంతం చేసుకోగా.. క‌థానాయ‌కుడి పాత్ర‌లో వెంక‌టేశ్ క‌నిపించ‌నున్నాడు. శ్రీ‌వాస్ ఈ రీమేక్ వెర్ష‌న్‌కి ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌నున్నాడ‌ని టాక్‌.

కాగా, ఒరిజ‌న‌ల్ వెర్ష‌న్‌లో ఓ క‌థానాయిక‌గా న‌టించిన టబు.. రీమేక్‌లో కూడా అదే పాత్ర‌లో క‌నిపించ‌నుంద‌ని స‌మాచారం. అదే గ‌నుక నిజ‌మైతే.. ‘కూలీ నం.1’ (1991) త‌రువాత వెంకీ, ట‌బు కాంబినేష‌న్‌లో వ‌చ్చే చిత్రం ఇదే అవుతుంది. దాదాపు మూడు ద‌శాబ్దాల త‌రువాత జోడీ క‌ట్ట‌నున్న వెంకీ, ట‌బు… మ‌రోసారి తెర‌పై క‌నువిందు చేస్తారేమో చూడాలి.

ప్ర‌స్తుతం ‘వెంకీ మామ‌’తో బిజీగా ఉన్న వెంకీ… ఆ త‌రువాత త్రినాథ‌రావ్ న‌క్కిన‌, తరుణ్ భాస్క‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో సినిమాలు చేస్తాడు. ఆ త‌రువాతే ‘దే దే ప్యార్ దే’ రీమేక్ ప‌ట్టాలెక్కుతుంద‌ని స‌మాచారం.

వాళ్లు 28 ఏళ్ల తర్వాత కలుస్తున్నారు! | actioncutok.com

More for you: