వెంకీ.. హార్స్ రేస్!


వెంకీ.. హార్స్ రేస్!
Venkatesh

వెంకీ.. హార్స్ రేస్!

‘ఎఫ్ 2’ ఘ‌న‌విజ‌యంతో సీనియ‌ర్ హీరో వెంక‌టేశ్ ఫుల్ జోష్‌లో ఉన్నాడు. ఎంత‌లా అంటే.. ఒక‌వైపు ‘వెంకీ మామ‌’లో న‌టిస్తూనే.. మ‌రో వైపు మూడు ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్‌ల‌ను లైన్‌లో పెట్టేశాడు. త్రినాథ‌రావ్ న‌క్కిన‌, త‌రుణ్ భాస్క‌ర్‌, శ్రీ‌వాస్ డైరెక్ష‌న్‌లో ఈ చిత్రాల‌ను చేస్తున్నాడు వెంకీ. త్రినాథ‌రావ్ న‌క్కిన కాంబినేష‌న్ మూవీ ప‌క్కా కామెడీ ఎంట‌ర్‌టైన‌ర్ కాగా.. శ్రీ‌వాస్‌తో చేయ‌నున్న సినిమా ‘దే దే ప్యార్ దే’కి తెలుగు వెర్ష‌న్‌.

ఇక ‘పెళ్ళి చూపులు’ ఫేమ్‌ త‌రుణ్ భాస్క‌ర్ రూపొందించ‌నున్న చిత్రానికి వ‌స్తే..  స్పోర్ట్స్ డ్రామా బ్యాక్‌డ్రాప్‌లో ఈ ప్రాజెక్ట్ ఉంటుంద‌ని తెలిసింది. హార్స్ రేసింగ్ నేప‌థ్యంతో సాగే ఈ చిత్రంలో వెంకీ ఓ డిఫ‌రెంట్ రోల్‌లో క‌నిపిస్తాడ‌ని టాక్‌. ప్ర‌స్తుతం ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు జ‌రుపుకుంటున్న ఈ సినిమాని ఈ ఏడాది చివ‌ర‌లో ప‌ట్టాలెక్కించేందుకు స‌న్నాహాలు చేస్తున్నారు. మ‌రి.. గ‌త చిత్రం ‘ఈ న‌గ‌రానికి ఏమైంది?’ తో నిరాశ‌ప‌రిచిన త‌రుణ్‌.. ఈ సినిమాతోనైనా అల‌రిస్తాడేమో చూద్దాం.

వెంకీ.. హార్స్ రేస్! | actioncutok.com

More for you: