ప్లేబాయ్ కాదు రైటర్..!

ప్లేబాయ్ కాదు రైటర్..!
వైవిధ్యభరితమైన పాత్రలతో ముందుకు సాగుతున్న యువ కథానాయకుడు విజయ్ దేవరకొండ. ప్రస్తుతం ‘డియర్ కామ్రేడ్’, ‘బ్రేకప్’ (పరిశీలనలో ఉన్న పేరు), ‘హీరో’ చిత్రాలతో ఈ యంగ్ హీరో బిజీగా ఉన్నాడు. ‘డియర్ కామ్రేడ్’లో స్టూడెంట్ లీడర్‌గా కనిపించనుండగా.. ‘హీరో’లో బైక్ రేసర్‌గా దర్శనమివ్వనున్నాడు విజయ్. ఈ రెండు చిత్రాలనూ నూతన దర్శకులు భరత్ కమ్మ, ఆనంద్ అన్నామలై తెరకెక్కిస్తున్నారు.
ఇక ‘బ్రేకప్’ విషయానికి వస్తే దీనిని ‘ఓనమాలు’, ‘మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు’ చిత్రాల దర్శకుడు క్రాంతి మాధవ్ రూపొందిస్తున్నాడు. రాశీ ఖన్నా, ఐశ్వర్యా రాజేశ్, ఇజాబెల్లి లీట్.. ఇలా ముగ్గురు కథానాయికలు ఈ సినిమాలో నటిస్తుండడంతో.. ఇందులో విజయ్ ప్లేబాయ్‌గా కనిపించనున్నట్లు ప్రచారం సాగింది. లేటెస్ట్ బజ్ ఏంటంటే.. విజయ్ ప్లేబాయ్‌గా కాకుండా.. రైటర్‌గా దర్శనమిస్తాడట. కాగా, ఈ రైటర్ పాత్రకు సంబంధించి ఓ ఆసక్తికరమైన విషయం తెలిసింది.
అదేమిటంటే.. రచయితగా తను రాసుకున్న కథల్లో తనే హీరోగా కనిపించనున్నాడట విజయ్. ఈ నేపథ్యంలో వచ్చే మూడు కథలలో ముగ్గురు కథానాయికలూ దర్శనమిస్తారట. అలా.. ముగ్గురు హీరోయిన్లతో మన రౌడీ హీరో రొమాన్స్ చేస్తాడట. అంతేకాదు, ఓ పాత్ర కోసం 8 ఏళ్ళ పిల్లాడికి తండ్రిగానూ కనిపించబోతున్నాడట విజయ్. మొత్తానికి.. విజయ్‌కి ఇదో కొత్త తరహా చిత్రమనే చెప్పాలి. ప్రస్తుతం పారిస్‌లో చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్.. ఈ ఏడాది చివరలో తెరపైకి రానుంది.
ప్లేబాయ్ కాదు రైటర్..! | actioncutok.com
More for you: