ఆ సినిమా విలువ.. నేడు రూ. 1400 కోట్లు!


ఆ సినిమా విలువ.. నేడు రూ. 1400 కోట్లు!

ఆ సినిమా విలువ.. నేడు రూ. 1400 కోట్లు!

విడిపోవడం.. కలుసుకోవడం.. ఈ ఫార్ములా భారతీయ సినిమాకి ఎప్పుడూ కాసుల వర్షం కురిపిస్తూనే ఉంది. తాజాగా విడుదలైన సల్మాన్ ఖాన్ సినిమా ఇదే ఫార్ములాతో కలెక్షన్లు కురిపిస్తోంది. తొలినాళ్లలో వచ్చిన ఎన్నో తెలుగు సినిమాలు ఈ ఫార్ములాతో ఘన విజయాలు సాధించాయి. జ్ఞాన్ ముఖర్జీ డైరెక్ట్ చేయగా 1943లో వచ్చిన హిందీ సినిమా ‘కిస్మత్’ ఈ ట్రెండ్‌కు మూలమని విశ్లేషకులు చెబుతుంటారు. విడిపోయిన ఎన్నో ఏళ్ల తర్వాత కలుసుకున్న తండ్రీ కొడుకుల కథతో రూపొందిన ఆ సినిమా ప్రేక్షకుల్ని అమితంగా ఆకట్టుకుంది.

అదే తరహా ఫార్ములాతో వచ్చి సూపర్ హిట్టయిన సినిమా ‘వఖ్త్’ (1965). యశ్ చోప్రా డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో బల్‌రాజ్ సాహ్ని, రాజ్‌కుమార్, సునీల్ దత్, శశికపూర్, షర్మిలా ఠాగూర్, సాధన ప్రధాన పాత్రలు పోషించారు. ఆ రోజుల్లో అది వసూలు చేసిన రూ. 3 కోట్లను ఇప్పటి విలువకు అన్వయింపజేస్తే దాని విలువ అక్షరాలా రూ. 1400 కోట్లు!

అవునా!.. అంతవుతుందా!.. అని ఆశ్చర్యపోతున్నారా?

అప్పటి బంగారం విలువను ఇప్పటి బంగారం విలువతో పోల్చి చూస్తే ఈ విషయం స్పష్టమవుతుంది. 1965లో 10 గ్రాముల బంగారం విలువ రూ. 72. ఇప్పుడు దాని విలువ రూ. 33,730. ఆ ప్రకారం చూస్తే ‘వక్థ్’ వసూళ్లు నేటి విలువ ప్రకారం రూ. 1398.60 కోట్లుగా తేలుతుంది. నేటి సినిమాలు అందులో ఎంత వసూలు చేస్తున్నాయో దాన్నిబట్టి ఊహిచుకోవచ్చు!

ఆ సినిమా విలువ.. నేడు రూ. 1400 కోట్లు! | actioncutok.com

More for you: