అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన యువరాజ్


అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన యువరాజ్
Yuvraj Singh

అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన యువరాజ్

అంతర్జాతీయ క్రికెట్ నుంచు రిటైరవుతున్నట్లు 2011 వరల్డ్ కప్ హీరో యువరాజ్ సింగ్ సోమవారం (జూన్ 10) ప్రకటించాడు. సౌత్ ముంబైలోని ఒక హోటల్‌లో నిర్వహించిన ఒక ప్రెస్ కాన్ఫరెన్స్‌లో తన నిర్ణయాన్ని అతడు బహిర్గతం చేశాడు.

“17 సంవత్సరాల పాటు నేను ఇంటర్నేషనల్ క్రికెట్ ఆడాను. ఇప్పుడు ఆ క్రికెట్‌కు ముగింపు పలికి ముందుకు వెళ్లానుకుంటున్నా. అది రోలర్ కోస్టర్ రైడ్. ఒక గొప్ప కథ. కానీ ఆ కథ ముగింపుకొచ్చింది. 25 ఏళ్ల పాటు 22 గజాల చుట్టూ తిరిగాను. 17 ఏళ్ల పాటు అంతర్జాతీయ క్రికెట్ ఆడాను. అక్కడ్నుంచి కదలాలని నిర్ణయించుకున్నా. ఈ ఆట నాకు ఎలా పోరాడాలో, ఎలా కిందపడాలో, దుమ్ము దులుపుకొని తిరిగి ఎలా లేవాలో, ఎలా ముందుకు సాగాలో నేర్పింది” అని చెప్పాడు యువరాజ్.

ఈ సందర్భంగా క్రికెటర్‌గా తనకు ఎంతగానో అండగా నిలిచి, తన ఐడల్ సచిన్ టెండూల్కర్‌కు ధన్యవాదాలు తెలిపాడు. ఇండియా గెలిచిన 2011 వరల్డ్ కప్ నాటి సంగతులను, ఆ టోర్నమెంట్ మొత్తం తను ఆడిన చక్కని ఇన్నింగ్స్‌ను అతను జ్ఞాపకం చేసుకున్నాడు. రిటైర్మెంట్ తర్వాత తను ఏం చెయ్యదలచుకున్నాడో కూడా యువరాజ్ తెలిపాడు. కేన్సర్ రోగులకు సాయపడుతూ, ఆ వ్యాధిపై ప్రజల్లో అవగాహన కలిగించడానికి కృషిచేస్తానని అతను చెప్పాడు.

యువరాజ్ చివరగా 2017లో అంతర్జాతీయ ఒన్‌డే ఆడాడు. ఈ ఏడాది ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్ తరపున నాలుగు మ్యాచ్‌లు ఆడాడు.

అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన యువరాజ్ | actioncutok.com

More for you: