అలనాటి చిత్రం: సతీ సక్కుబాయి (1954)


అలనాటి చిత్రం: సతీ సక్కుబాయి (1954)

అలనాటి చిత్రం: సతీ సక్కుబాయి (1954)

తారాగణం: ఎస్. వరలక్ష్మి (సక్కుబాయి), కన్నాంబ (సక్కుబాయి అత్త), రేలంగి (విశ్వం), శివరావు (గణపతి), సి.ఎస్.ఆర్. ఆంజనేయులు, కనకం, సూరిబాబు, రఘురామయ్య, వంగర

సంభాషణలు: రావూరి

పాటలు: దైతా గోపాలం

సంగీతం: రామచంద్రరావు

దర్శకుడు: కడారు నాగభూషణం

బేనర్: శ్రీ రాజరాజేశ్వరి ఫిల్మ్ కంపెనీ

విడుదల తేదీ: 25 డిసెంబర్ 1954

సక్కుబాయి పరమ భక్తురాలైన ఒక మహారాష్ట్ర స్త్రీ. పాండురంగని భక్తురాలు. ఎప్పుడూ పాండురంగని ధ్యానం చేస్తూ, భర్తను దైవ సమానునిగా భావించి సేవచేస్తూ, అత్తమామలకు పరిచర్యలు చేస్తూ ఉంటుంది. అత్తకు ఆమె వైఖరి నచ్చక అనేక కష్టాలు పెడుతుంది. సక్కుబాయి కష్టాల్ని శ్రీకృష్ణ పరమాత్ముడు తొలగించి ఆమెకు దివ్యత్వాన్ని ప్రసాదిస్తాడు. అత్తకు కూడా జ్ఞానోదయం అవుతుంది.

సక్కుబాయి చరిత్ర మహారాష్ట్రులదైనా, తెలుగునాట కూడా ఒకప్పుడు అది ప్రసిద్ధి పొందింది. సక్కుబాయి నాటకాన్ని పూర్వం ఇక్కడ బాగా ప్రదర్శించేవాళ్లు. గతంలోనూ సక్కుబాయి చరిత్రపై ఒక తెలుగు సినిమా వచ్చింది. దాన్నీ మళ్లీ పునర్నిర్మించారు. సక్కుబాయి, ఆమె అత్త పాత్రల్లో ఎస్. వరలక్ష్మి, కన్నాంబ పోటీపడి నటించి మెప్పించారు. సక్కుబాయి భర్త విశ్వంగా రేలంగి నటన గురించి చెప్పేదేముంది! అమోఘం. గణపతిగా శివరావూ ఆకట్టుకుంటారు.

రావూరి సంభాషణలు భక్తుల్ని మెప్పిస్తాయి. దైతా గోపాలం రాసిన పాటలకు రామచంద్రరావు సమకూర్చిన సంగీతం అలరించింది. కడారు నాగభూషణం దర్శకత్వ ప్రతిభతో ఈ సినిమా ఆ రోజుల్లో బాగా ఆడింది.

అలనాటి చిత్రం: సతీ సక్కుబాయి (1954) | actioncutok.com

More for you: