సినిమా నిర్మాణం ఒక దీక్ష!


– ‘యాక్షన్ కట్ ఓకే’ బృందం
సినిమా నిర్మాణం ఒక దీక్ష!

సినిమా నిర్మాణం ఒక దీక్ష!

ఏ సినీ పరిశ్రమలోనైనా పెద్ద హిట్ వస్తే పదిమందికీ జీవనాధారం దొరుకుతుందని అంటారు. మరి అలాంటి హిట్ సాధించాలంటే ఎక్కువ పెట్టుబడి పెట్టి సినిమా నిర్మించాలా? లేక పెద్ద రేంజ్ కాస్టింగ్ పెట్టి సినిమా తీయాలా? మంచి కథ, కథనం ఎంపిక చేసుకోవాలా? భారీ టెక్నాలజీ ఉపయోగించాలా?.. ఇలా ఎన్నో ప్రశ్నలు వేసుకున్నప్పటికీ అన్నీ సమపాళ్లలో ఉంటేనే సినిమా హిట్ సాధిస్తుందనేది ప్రాథమిక సత్యం. అందుకే ఒక పెద్ద హిట్ వచ్చినప్పుడు ఆ ఆనందంలో అందరూ పాలుపంచుకోవడం, ఆ విజయాన్ని అందరిదిగా చెప్పుకోవడం కనిపిస్తుంది.

F2

ఎక్కువ చిన్న చిత్రాలు నిర్మించి పరిశ్రంలో పదిమందికి పని కల్పించాలని కొందరు అభిప్రాయపడుతుంటే, చిన్న చిత్రాల వల్ల పరిశ్రమకు మంచి జరిగినా నిర్మాతలకు మాత్రం చేదు అనుభవాలే మిగులుతాయనేది ఆ నిర్మాతల అభిప్రాయం. కానీ అప్పుడప్పుడు చిన్న సినిమాలు కూడా పెద్ద విజయాలు సాధించి ఇండస్ట్రీని ఆశ్చర్యానికి గురిచేసి, చిన్న సినిమాల నిర్మాణం పెరగడానికి కారణమవుతుంటాయి.

సినిమా నిర్మాణం ఒక దీక్ష!
Majili

ఈ పరంపరలో చిన్న సినిమా నిర్మాణంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకోకపోవడంతో వరుస ఫ్లాపుల్ని, నష్టాల్ని చవిచూసిన నిర్మాతలు మట్టికొట్టుకుపోతారు, లేదంటే ఆపసోపాలు పడి భారీ సినిమాల వైపు దృష్టిపెడతారు. ఈ మధ్య విడుదలైన కొన్ని చిన్న సినిమాలు సేఫ్ జోన్‌లోకి వెళ్లి ఆశలు చిగురింపజేశాయి. ‘బ్రోచేవారెవరురా’, ‘ఏజెంట్ సాయి శ్రీనివస ఆత్రేయ’, ‘ఫలక్‌నుమా దాస్’ వంటివి అందుకు ఉదాహరణలు.

సినిమా నిర్మాణం ఒక దీక్ష!
Jersey

పెద్ద సినిమాల విషయానికొస్తే ‘ఎఫ్ 2’, ‘మజిలీ’, ‘మహర్షి’ చిత్రాలు ఘన విజయం సాధించాయి. నానికి ‘జెర్సీ’ సంతృప్తితో పాటు మంచి పేరునూ తెచ్చింది. ‘118’తో చాలా కాలం తర్వాత కల్యాణ్‌రాం హిట్ సాధించాడు. ‘చిత్రలహరి’తో సాయిధరంతేజ్ ఫర్వాలేదనిపించుకున్నాడు. ఇక త్వరలో రాబోయే సమంత ‘ఓ బేబీ’, రాం ‘ఇస్మార్ట్ శంకర్’, విజయ్ దేవరకొండ ‘డియర్ కామ్రేడ్’, శర్వానంద్ ‘రణరంగం’, నాగార్జున ‘మన్మథుడు 2’, ప్రభాస్ ‘సాహో’, నాని ‘గ్యాంగ్ లీడర్’ ఏ విధంగా ప్రేక్షకుల్ని మెప్పించి డబ్బులు వసూలు చేస్తారో చూడాలి.

సినిమా నిర్మాణం ఒక దీక్ష!
118

ఇప్పుడిప్పుడే టాలీవుడ్ కూడా జాతీయ, అంతర్జాతీయ ప్రమాణాలతో సినిమాలు నిర్మించడం నేర్చుకుంటోంది. దానికి భారీ పెట్టుబడులు అవసరం. మరి అలాంటి చిత్రాలు తియ్యాలంటే లైట్‌బాయ్ మొదలు నిర్మాత వరకు ప్రతివొక్కరు చిత్తశుద్ధితో పనిచెయ్యాల్సిందే. కాని టాలీవుడ్‌లో పిండికి తగ్గ రొట్టె వెయ్యడం చేతకాకపోవడం వల్ల సినిమా మధ్యలోనే నిర్మాతలు కష్టాలను కొని తెచ్చుకుంటున్నారు. అలాంటి సందర్భాల్లో ఖర్చును అదుపులో పెట్టాలని పెద్దలు సలహాలిస్తుంటారు. కానీ హిందీలో భారీ పెట్టుబడులు పెట్టి బాధ్యతతో సినిమా తీసి మార్కెట్ పరిధి పెంచుకుంటూ లాభాల్ని ఆర్జిస్తున్నారు.

సినిమా నిర్మాణం ఒక దీక్ష!
Chitralahari

టాలీవుడ్‌లో ఏడాదికి ఒకటో, రెండో భారీ హిట్లు సాధిస్తే అదే గొప్పగా భావిస్తున్నారు. ఇలాంటి తీరు ఉన్నంత కాలం టాలీవుడ్ ఎక్కువ విజయాలు సాధించదు. ఒక సినిమాకు కథ, కథనం ఎంత ముఖ్యమో నిర్మాణ బాధ్యత కూడా అంతే ముఖ్యం. దాన్ని దీక్షగా తీసుకోవాలి. అప్పుడే తెలుగు సినిమా మరింత విస్తరిస్తుంది. ఇతర భాషల్లోనూ అనువాదమై, రీమేకై తన సత్తా చాటుతుంది.

సినిమా నిర్మాణం ఒక దీక్ష!

సినిమా నిర్మాణం ఒక దీక్ష! | actioncutok.com

More for you: