‘డియర్ కామ్రేడ్’ను రీమేక్ చేయనున్న కరణ్ జోహార్


'డియర్ కామ్రేడ్'ను రీమేక్ చేయనున్న కరణ్ జోహార్

‘డియర్ కామ్రేడ్’ను రీమేక్ చేయనున్న కరణ్ జోహార్

బాలీవుడ్ స్టార్ డైరెక్టర్, ప్రొడ్యూసర్ కరణ్ జోహార్ ‘డియర్ కామ్రేడ్’ను హిందీలో రీమేక్ చెయ్యాలని నిర్ణయించారు. హీరో విజయ్ దేవరకొండ, డైరెక్టర్ భరత్ కమ్మ, నిర్మాత నవీన్ ఎర్నేని ఆయన కోసం ‘డియర్ కామ్రేడ్’ను ప్రత్యేకంగా ప్రదర్శించారు.

సినిమాలో విజయ్, రష్మికా మందన్న అభినయాన్ని కరణ్ ప్రశంసించారు. డైరెక్టర్ భరత్, సంగీత దర్శకుడు జస్టిన్ ప్రభాకరన్ పనితనాన్ని మెచ్చుకున్నారు. ఆ తర్వాత ‘డియర్ కామ్రేడ్’ను హిందీలో రీమేక్ చేయనున్నట్లు ప్రకటించారు. దానికి సంబంధించిన వివరాలను ఆయన త్వరలోనే వెల్లడించనున్నారు.

కాగా ‘డియర్ కామ్రేడ్’ చిత్రం తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో జూలై 26న విడుదలవుతోంది.

‘డియర్ కామ్రేడ్’ను రీమేక్ చేయనున్న కరణ్ జోహార్ | actioncutok.com

More for you: