‘మిస్ మ్యాచ్’.. ఒక మంచి కథ!


'మిస్ మ్యాచ్'.. ఒక మంచి కథ!

‘మిస్ మ్యాచ్’.. ఒక మంచి కథ!

అధిరోహ్ క్రియేటివ్ సైన్స్ ఎల్.ఎల్.పి పతాకంపై రూపొందుతోన్న తొలి చిత్రం ‘మిస్ మ్యాచ్’. ఉదయ్ శంకర్ (‘ఆట గదరా శివ’ ఫేమ్) కథానాయకునిగా, ఐశ్వర్య రాజేష్ (దివంగత నటుడు రాజేష్ కుమార్తె) నాయికగా నటిస్తున్నారు. తమిళనాట హీరో విజయ్ ఆంటోని నటించగా ‘సలీం’ వంటి విజయవంతమైన చిత్రాన్ని రూపొందించిన ఎన్.వి. నిర్మల్ కుమార్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఆయనకిది తొలి తెలుగు చిత్రం.

ఈ సినిమా గురించి హీరో ఉదయ్ శంకర్ మాట్లాడుతూ…”మిస్ మ్యాచ్ చిత్ర కథను భూపతిరాజా ఇచ్చారు. మంచి కథలు వింటున్న సమయంలో ఈ కథ నాకు రావడం అదృష్టం. దర్శకుడు ఈ సినిమాను తెరకెక్కించిన విధానం సినిమాకు ప్లస్. ట్యాలెంటెడ్ ఆర్టిస్ట్ ఐశ్వర్య రాజేష్ పక్కన నేను నటించడం గ్రేట్ ఎక్స్ పీరియన్స్ . ‘తొలిప్రేమ’ సినిమాలోని ‘ఈ మనసే’ సాంగ్ ను సింగిల్ షాట్ లో తీశారు. కథ, కథనాలు ప్రేక్షకులను అలరిస్తాయి. త్వరలో చిత్రం  విడుదల డేట్ ను ప్రకటిస్తాం” అన్నారు.

హీరోయిన్ ఐశ్వర్య రాజేష్ మాట్లాడుతూ…”ఒకమంచి కథ మిస్ చేసుకోకూడదని ఈ సినిమా చేసాను. భూపతిరాజా గారి కథ బాగుంది. దర్శకుడు కథను అందంగా తెరమీద చూపించారు. నా పాత్ర ఈ సినిమాలో కొత్తగా ఉంటుంది. రఫ్ రోల్ లో మీ ముందుకు వస్తున్నాను. నిర్మాతలు ఎక్కడా రాజీ పడకుండా సినిమాను నిర్మించారు. ఈ రోజు చిన్న సినిమాగా కనిపించే ఈ మూవీ రిలీజ్ తరువాత అందరూ పెద్ద సినిమాగా ఈ సినిమా గురించి మాట్లాడతారు. గణేష్ సినిమాటోగ్రఫీ బాగుంది. పవన్ కళ్యాణ్ గారి  ‘తొలిప్రేమ’ సినిమాలోని ఒక పాటను ఈ సినిమాలో రీమిక్స్ చేసాం. తప్పకుండా ఆ పాట మీ అందరికి నచ్చుతుంది”అన్నారు.

దర్శకుడు ఎన్.వి. నిర్మల్ కుమార్ మాట్లాడుతూ…”ఈ చిత్రంలో హీరో హీరోయిన్ కెమిస్ట్రీ బాగా వర్క్ఔట్ అయ్యింది. కొత్త కథతో దర్శకుడిగా తెలుగులో పరిచయం అవుతున్నందుకు ఆనందంగా ఉంది. అందరికి ఈ సినిమా నచ్చుతుందని భావిస్తున్నాను” అన్నారు.

నిర్మాత భరత్ రామ్ మాట్లాడుతూ.. “ఈ కథ బాగా నచ్చింది. ఉదయ్ శంకర్, ఐశ్వర్య రాజేష్ చాలా బాగా నటించారు. హీరోయిన్ ఒక స్పోర్ట్స్ నేపథ్యంగా ఉన్న పాత్రలో నటించింది. ఛాలెంజింగ్ రోల్ లో నటించింది. గిఫ్టన్ ఇలియాస్ సంగీతం, నేపథ్య సంగీతం సినిమాకు ప్రధాన ఆకర్షణ కానున్నాయి” అన్నారు.

ఈ చిత్రం లోని ఇతర ప్రధాన పాత్రలలో సంజయ్ స్వరూప్, ప్రదీప్ రావత్, రూపాలక్ష్మి తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం: గిఫ్టన్ ఇలియాస్, కథ: భూపతి రాజా, మాటలు: రాజేంద్రకుమార్, మధు; ఛాయా గ్రహణం: గణేష్ చంద్ర; పాటలు: సిరివెన్నెల సీతారామ శాస్త్రి, సుద్దాల అశోక్ తేజ; కళా దర్శకుడు: మణి వాసగం, నిర్మాతలు: జి.శ్రీరామ్ రాజు, భరత్ రామ్.

‘మిస్ మ్యాచ్’.. ఒక మంచి కథ! | actioncutok.com

More for you: