యంగ్ టైగర్ కంటే కింగ్ ఎక్కువా!


యంగ్ టైగర్ కంటే కింగ్ ఎక్కువా!
Nagarjuna

యంగ్ టైగర్ కంటే కింగ్ ఎక్కువా!

సల్మాన్ ఖాన్ హోస్ట్‌గా చేస్తోన్న హిందీ ‘బిగ్ బాస్’ రియాలిటీ గేం షో సూపర్ డూపర్ హిట్టయింది. ఆ గేం షో తెలుగు వెర్షన్ రెండు సీజన్లూ వ్యూయర్స్‌కు మజా అందించాయి. ఫస్ట్ సీజన్‌కు జూనియర్ ఎన్టీఆర్, సెకండ్ సీజన్‌కు నాని హోస్ట్స్‌గా సక్సెసయ్యారు. ఇప్పుడు థర్డ్ సీజన్ కోసం హోస్ట్‌గా మారుతున్నారు కింగ్ నాగార్జున. సినీ యాక్టర్‌గా రెమ్యూనరేషన్ విషయంలో నాగ్ కంటే చిన్న ఎన్టీఆర్ నాలుగు మెట్లు ఎత్తులో ఉంటే, ‘బిగ్ బాస్’ హోస్ట్‌గా జూనియర్‌పై కింగ్ రెండు మెట్లు ఎత్తులో ఉన్నారనేది లేటెస్ట్ టాలీవుడ్ టాక్.

‘బిగ్ బాస్’ తెలుగు తొలి సీజన్‌కు హోస్‌గా వ్యవహరించిన జూనియర్ ఎన్టీఆర్‌కు నిర్వాహకులు ఎపిసోడ్‌కు 10 లక్షల రూపాయల చొప్పున చెల్లించారని చెప్పుకుంటారు. రెండో సీజన్‌కు హోస్ట్ అయిన నాని సైతం అదే రెమ్యూనరేషన్ అందుకున్నాడు. ఇప్పుడు మూడో సీజన్‌కు హోస్ట్‌గా నాగార్జున వ్యవహరించబోతున్నారు. దీని కోసం ఆయనకు మరింత ఎక్కువ రెమ్యూనరేషన్ ఇచ్చేందుకు నిర్వాహకులు ముందుకొచ్చారని గుసగుసలు వినిపిస్తున్నాయి.

ఒక్కో ఎపిసోడ్‌కు నాగ్ 12 లక్షలు రెమ్యూనరేషన్ అందుకుంటున్నారనేది ఆ గుసగుసల సారాంశం. అంటే జూనియర్ కంటే కింగ్‌కు అందుతోంది ఎక్కువన్న మాట. సినిమాల విషయానికొస్తే చిన్న ఎన్టీఆర్ బిజినెస్ రేంజ్ ఎక్కువ కాబట్టి సహజంగానే నాగ్ కంటే ఆయన అందుకొనే రెమ్యూనరేషన్ చాలా ఎక్కువ.

కానీ టీవీకొచ్చేసరికి సీన్ మారిపోయింది. ‘బిగ్ బాస్ 3’ షో 100 ఎపిసోడ్స్ నడుస్తుంది కాబట్టి, ఈ షోతో కింగ్ 12 కోట్లు వెనకేసుకోనున్నట్లు టాలీవుడ్‌లో జోరుగా ప్రచారం నడుస్తోంది. యాక్టర్‌గా నాగ్ ఎంతో కష్టపడి రెండు సినిమాలు చేస్తే వచ్చే డబ్బును మూడున్నర మాసాలు కొనసాగే ఒక్క టీవీ షోతో హోస్ట్‌గా సంపాదించెయ్యడం విశేషమే.

యంగ్ టైగర్ కంటే కింగ్ ఎక్కువా! | actioncutok.com

More for you: