నానీస్ గ్యాంగ్!


నానీస్ గ్యాంగ్!

నానీస్ గ్యాంగ్!

నేచురల్ స్టార్ అంటూ ఫ్యాన్స్ ముద్దుగా పిలుచుకొనే నాని.. ‘గ్యాంగ్ లీడర్’గా కనిపించేందుకు చకచకా సిద్ధమవుతున్నాడు. అతను ఏ గ్యాంగ్‌కు లీడర్? అతని గ్యాంగ్ మెంబర్స్ ఎవరు? అనే ఆసక్తి మీలో ఉంది కదూ.. అక్కడికే వస్తున్నానండీ. నాని గ్యాంగ్‌లో ఉన్నవాళ్లంతా లేడీసే. ఐదుగురు లేడీస్. వాళ్లలో ఆరేళ్ల చిన్నపిల్ల నుంచి ఎనభై ఏళ్ల బామ్మ దాకా ఉండటం ఇంటెరెస్టింగ్ థింగ్. నానితో పాటు ఆ లేడీస్ అంతా బైనాక్యులర్స్ పెట్టుకొని ఏదో ఆపరేషన్‌లో ఉన్నట్లు కనిపిస్తోన్న ఫస్ట్ లుక్ ఇప్పుడు ఆన్‌లైన్‌లో వైరల్ అవుతోంది.

బామ్మ.. వరలక్ష్మి.. ప్రియ.. స్వాతి.. చిన్ను.. అంటూ అయిదు పాత్రలని పరిచయం చేస్తూ ‘నానీస్ గ్యాంగ్ లీడర్’ ఫస్ట్ లుక్  విడుదల చేశాడు నాని. అవును. ఈ సినిమా పేరు ‘గ్యాంగ్ లీడర్’ కాదు.. ‘నానీస్ గ్యాంగ్ లీడర్’. అదివరకే ‘గ్యాంగ్ లీడర్’ టైటిల్‌ను వేరే వాళ్లు రిజిస్టర్ చేసుకోవడంతో టైటిల్ కు ‘నానీస్’ అనే మాటని జోడించారు ప్రొడ్యూసర్లు. విక్రం కె. కుమార్ ఈ సినిమా డైరెక్టర్.

ఇక విషయానికొస్తే తన గ్యాంగ్‌లోని ఐదుగురు ఆడవాళ్లతో నాని ఏదో పెద్ద ప్రమాదకరమైన పనిని చేపట్టినట్లు ఫస్ట్ లుక్‌ని బట్టి అర్థమవుతోంది. ఈ సినిమాలో విలన్‌గా ‘ఆర్ ఎక్స్ 100’ హీరో కార్తికేయ యాక్ట్ చేస్తున్నాడు. అతనికి సంబంధించిన ఏదో రహస్యాన్ని ఛేదించడానికి నాని గ్యాంగ్ రంగంలోకి దిగిందని అనుకోవాలి. సినిమాపై ఈ ఫస్ట్ లుక్ మరింత ఇంటరెస్ట్ ను పెంచింది. ఈ మూవీలోని ఫస్ట్ సాంగ్ ని జూలై 18న, టీజర్‌ని జూలై 24న రిలీజ్ చేస్తున్నారు. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తయారవుతున్న ‘నానీస్ గ్యాంగ్ లీడర్’ ఆగస్ట్ 30న మన ముందుకు వస్తోంది.

More for you: