‘కొబ్బరి మట్ట’ నైజాం, ఓవర్సీస్ రైట్స్ సొంతం చేసుకున్న నో బారియర్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్


'కొబ్బరి మట్ట' నైజాం, ఓవర్సీస్ రైట్స్ సొంతం చేసుకున్న నో బారియర్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్

‘కొబ్బరి మట్ట’ నైజాం, ఓవర్సీస్ రైట్స్ సొంతం చేసుకున్న నో బారియర్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్

‘హృదయ కాలేయం’ సినిమాతో తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో, కాలేయంలో టెంట్ వేసుకొని పడుకున్న బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు త్రిపాత్రలు పోషించిన చిత్రం ‘కొబ్బరి మట్ట’. ‘హృదయ కాలేయం’ సృష్టికర్త స్టీవెన్ శంకర్ అలియాస్ సాయి రాజేశ్ ఈ చిత్రానికి కథ, కథనం, మాటలు అందించారు. రూపక్ రోనాల్డ్‌సన్‌ను డైరెక్టర్‌గా పరిచయం చేస్తూ దాదాపు 3 సంవ‌త్స‌రాల‌కు పైగా అత్యాధునిక సాంకేతిక నైపుణ్యంతో, నిపుణుల పర్య‌వేక్ష‌ణ‌లో, భారీ వ్యయంతో ఎక్కడా కాంప్ర‌మైజ్ కాకుండా ఎండ‌న‌కా, వాన‌న‌కా, చ‌లిని సైతం త‌ట్టుకుని ప్రేక్ష‌కుడికి వినోదాన్ని అందించాల‌నే నిరంత‌ర కృషితో, క‌సితో సాయి రాజేశ్ నిర్మించిన చిత్రం ‘కొబ్బ‌రి మ‌ట్ట‌’.

ఈ చిత్రంలో సంపూర్ణేష్ బాబు మూడు పాత్ర‌లు వేయ‌ట‌మే కాకుండా అత్యంత భారీ డైలాగ్‌లు చెప్పి లిమ్కా బుక్ ఆప్ వ‌ర‌ల్డ్ రికార్డ్స్‌లో చోటు సంపాదించారు. ఈ చిత్రంలో పాపారాయుడు, పెద‌రాయుడు, ఆండ్రాయుడు అనే పాత్ర‌లు చేసి మెప్పించ‌బోతున్నారు. ఈ ప్ర‌తిష్టాత్మ‌క చిత్రంలో తెలుగు చిత్రసీమలో పేరుపొందిన పలువురు నటీనటులు న‌టించారు. ఇటీవ‌ల విడుద‌ల చేసిన ‘అఆ.. ఇఈ..’ అనే పాటకు యూట్యూబ్ లో రెండు మిలియ‌న్స్ వ్యూస్ 24 గంట‌ల్లో రావ‌టం ఈ చిత్రంపై సినిమా ల‌వ‌ర్స్ కి వున్న క్రేజ్ ని తెలియ‌జేస్తుంది.

ఈ భారీ చిత్రాన్ని ఆగస్ట్ 10 న ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురావ‌టానికి నిర్మాత సన్నాహాలు చేస్తున్నారు. ప్రేక్ష‌కుల్ని ఎంట‌ర్‌టైన్ చేయ‌టంలో ఎక్క‌డా బారియర్స్ లేని ఇంత‌టి క్రేజి చిత్రాన్ని నైజాం, ఓవ‌ర్‌సీస్ హ‌క్కుల్ని నో బారియ‌ర్స్ ఎంట‌ర్‌టైన్‌మెంట్ సంస్థ సొంతం చేసుకుంది. యాక్ష‌న్‌, కామెడీ, సెంటిమెంట్‌, రొమాన్స్‌, సందేశం, ఎమోష‌న్‌, ల‌వ్ లాంటి అన్ని జోనర్స్ క‌ల‌యికే 120 నిమిషాల ఈ ‘కొబ్బ‌రిమ‌ట్ట‌’ అని నిర్మాత తెలిపారు.

‘కొబ్బరి మట్ట’ నైజాం, ఓవర్సీస్ రైట్స్ సొంతం చేసుకున్న నో బారియర్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ | actioncutok.com

More for you: