ప్రభాస్‌కు ఆనందాన్నిచ్చిన ‘బాహుబలి’ రాకెట్‌!


ప్రభాస్‌కు ఆనందాన్నిచ్చిన ‘బాహుబలి’ రాకెట్‌!

ప్రభాస్‌కు ఆనందాన్నిచ్చిన ‘బాహుబలి’ రాకెట్‌!

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించిన చంద్రయాన్‌ 2 ప్రయోగం విజయవంతం అయింది. అనుకున్న ప్రకారం అనుకున్న టైమ్‌కు నిర్ణీత కక్ష్యలోకి శాస్త్రవేత్తలు ప్రవేశపెట్టడంతో సర్వత్రా ప్రశంసలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ‘బాహుబలి’ హీరో ప్రభాస్‌ కూడా స్పందించారు. చంద్రయాన్‌ 2ని మోసుకెళ్లిన రాకెట్‌కు ఇస్రో ‘బాహుబలి’ అని పేరు పెట్టడంపై ప్రభాస్‌ హర్షం వ్యక్తం చేశారు.

‘‘హలో డార్లింగ్స్‌.. చంద్రయాన్‌ 2 ప్రయోగం విజయవంతం కావడం భారతీయుందరికీ గర్వకారణం. చంద్రయాన్‌ 2ను కక్ష్యలో ప్రవేశపెట్టిన రాకెట్‌కు ‘బాహుబలి’ అని పేరు పెట్టడం మాకు దక్కిన గౌరవంగా భావిస్తున్నా. ఈ ప్రయోగం విజయవంతం అవడం వెనుక ఎన్నో ఏళ్ల కృషి ఉంది.’’ అని ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా తెలిపారు.

ప్రభాస్‌కు ఆనందాన్నిచ్చిన ‘బాహుబలి’ రాకెట్‌! | actioncutok.com

More for you: