బాలీవుడ్‌కు ప్రియాంక గుడ్‌బై?


బాలీవుడ్‌కు ప్రియాంక గుడ్‌బై?

బాలీవుడ్‌కు ప్రియాంక గుడ్‌బై?

బాలీవుడ్‌కు ప్రియాంక చోప్రా గుడ్‌బై చేపేసిందా?.. ముంబైలోని సినీ జనాల మధ్య ఇప్పుడు హాట్ టాపిక్ ఇదే.

నిన్నటి దాకా ప్రియాంక టాప్ బాలీవుడ్ స్టార్. ఇప్పటికీ ఆమెకు డిమాండ్ ఏమీ తగ్గలేదు. కానీ మూడేళ్ల నుంచీ ఆమె ఒక్కటంటే ఒక్కటి.. ఏ బాలీవుడ్ మూవీలోనూ కనిపించలేదు. 2016లో వచ్చిన ‘జై గంగాజల్’ సినిమాలో చివరిసారిగా కనిపించింది ప్రియాంక.

ముంబైలో కంటే హాలీవుడ్‌లోనే ఎక్కువగా గడుపుతున్న ప్రియాంకా చోప్రా లాస్ట్ యియర్ సల్మాన్ ఖాన్ సినిమా ‘భారత్’లో హీరోయిన్‌గా నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కానీ తర్వాత మనసు మార్చుకొని, తన పెళ్లి వంకతో ఆ ప్రాజెక్ట్ నుంచి తనకు తానుగా బయటకు వచ్చేసింది. ఆ కేరెక్టర్‌ను కత్రినా కైఫ్ చేసింది.

త్వరలో ‘ద స్కై ఈజ్ పింక్’ సినిమాలో కనిపించనున్న ప్రియాంక ఇంతవరకు మరే బాలీవుడ్ సినిమాకీ సైన్ చెయ్యలేదు. ఆమె వరస చూస్తుంటే బాలీవుడ్‌కు గుడ్‌బై చెప్పేసినట్లుందని అక్కడి జనాలు చెవులు కొరుక్కోవడం మొదలుపెట్టారు. అమెరికన్ సింగర్, యాక్టర్ అయిన నిక్ జోనాస్‌ను పెళ్లాడిన తర్వాత ప్రియాంక బాలీవుడ్‌పై పెద్దగా ఆసక్తి చూపించడం లేదనీ, అమెరికన్ టీవీ సిరీస్, హాలీవుడ్ సినిమాలకే ప్రయారిటీ ఇస్తోందనీ వాళ్లంటున్నారు.

అయితే ఒక వెర్షన్ ప్రకారం ఆమె బాలీవుడ్‌కు ఇంకా టాటా చెప్పలేదు. కేవలం స్టార్ హీరో సినిమా అనో, లేదంటే స్టార్ డైరెక్టర్ మూవీ అనో ఒప్పుకొనే ఉద్దేశం ప్రియాంకకు లేదు. స్టోరీలో తన రోల్‌కు ఇంపార్టెన్స్ ఉండాలని ఆమె కోరుకుంటోంది.

మరి బాలీవుడ్ స్క్రీన్‌పై ప్రియాంక ఎప్పుడు కనిపిస్తుందో, అసలు కనిపిస్తుందో, లేదో.. లెటజ్ వెయిట్ అండ్ సీ.

బాలీవుడ్‌కు ప్రియాంక గుడ్‌బై? | actioncutok.com

More for you: