చెర్రీ సైతం ఇన్‌స్టాగ్రాం ఖాతా తెరిచాడు!


చెర్రీ సైతం ఇన్‌స్టాగ్రాం ఖాతా తెరిచాడు!

చెర్రీ సైతం ఇన్‌స్టాగ్రాం ఖాతా తెరిచాడు!

సోషల్ మీడియా.. ఏ విషయాన్నైనా క్షణాల్లో ప్రపంచవ్యాప్తం చేస్తోన్న మీడియా. తమ ఫీలింగ్స్‌నీ, తమకు సంబంధించిన విషయాల్నీ తమ అభిమానులకూ, తమ ఫాలోయర్స్‌కూ షేర్ చేసుకోడానికి సెలబ్రిటీలకు పనికొస్తోన్న గొప్ప టూల్.

చాలామంది సినీ సెలబ్రిటీస్ ఇప్పటికే ఫేస్‌బుక్, ట్విట్టర్, ఇన్‌స్టాగ్రాం వంటి సోషల్ మీడియా అకౌంట్స్‌తో టచ్‌లో ఉండగా, ఇంకా వాటికి దూరంగా ఉన్న మిగతా స్టార్స్ కూడా ఒక్కొక్కరే వాటిలో ఖాతాలు తెరుస్తున్నారు. అలా నిన్న ‘బాహుబలి’ ప్రభాస్ ఇన్‌స్టాగ్రాం అకౌంట్ తెరిచిన విషయం మనకు తెలుసు. లేటెస్ట్‌గా ఆ లీగ్‌లో మెగా పవర్‌స్టార్ రాంచరణ్ సైతం చేరిపోయాడు. ఇన్‌స్టాగ్రాం ఖాతా తెరిచాడు.

ఇప్పటికే రాంచరణ్ ఫేస్‌బుక్‌తో అరుదుగా, ఏవైనా స్పెషల్ అకేషన్స్‌లోనే ఫ్యాన్స్‌ను పలకరిస్తూ వస్తున్నాడు. అక్కడ ఆయనకు 5 మిలియన్ ఫాలోయర్స్ ఉన్నారు. ఇప్పుడు ‘ఆల్వేస్‌రాంచరణ్’ అనే పేరుతో ఇన్‌స్టాగ్రాం పేజీ ఓపెన్ చేశాడు. లేటెస్ట్ మూవీ ‘ఆర్ ఆర్ ఆర్’ లుక్‌ను ప్రొఫైల్ పిక్‌గా ఉంచాడు. 24 అవర్స్‌లో ఆ పిక్‌కు 1.3 లాక్స్ లైక్స్ రావడం చరణ్ పాపులారిటీకి నిదర్శనం. ఇక ఇదే టైంకి 1.64 లాక్స్ ఫాలోయర్స్ తయారయ్యారు.

ప్రభాస్, చరణ్.. ఇద్దరికీ సంబంధించిన ఒక సిమిలారిటీ ఏమంటే ఇప్పటికీ వాళ్లకు ట్విట్టర్ అకౌంట్స్ లేకపోవడం, ఇద్దరికీ ఫేస్‌బుక్ అకౌంట్స్ ఉండటం!

చెర్రీ సైతం ఇన్‌స్టాగ్రాం ఖాతా తెరిచాడు! | actioncutok.com

More for you: