‘థోర్ 4’కు డైరెక్టర్ ఆయనే


'థోర్ 4'కు డైరెక్టర్ ఆయనే

‘థోర్ 4’కు డైరెక్టర్ ఆయనే

క్రిస్ హెమ్స్‌వర్త్ టైటిల్ పాత్రధారిగా మార్వెల్ స్టూడియోస్ నిర్మించిన ‘థోర్’ ఫ్రాంచైజీలోని మూడు సినిమాలు ఒక దాన్ని మించి మరొకటి హిట్టయ్యాయి. తొలి సినిమా ‘థోర్’కు కెన్నెత్ బ్రానఘ్, రెండో సినిమా ‘థోర్: ద డార్క్ వరల్డ్’కు అలన్ టేలర్, మూడో సినిమా ‘థోర్: రాగ్నరాక్’కు తైకా వైటిటి దర్శకత్వం వహించారు. ఇప్పుడు ఆ సిరీస్‌లోని నాలుగో సినిమా నిర్మాణానికి మార్వెల్ స్టూడియోస్ సన్నాహాలు ప్రారంభించింది. మూడింటిలోనూ విమర్శకుల ప్రశంసలు, ప్రేక్షకుల ఆదరణ అధికంగా పొందిన ‘థోర్: రాగ్నరాక్’ డైరెక్టర్ తైకా వైటిటి నాలుగో సినిమానీ డైరెక్ట్ చేసే అవకాశాన్ని పొందాడు.

నిజానికి వార్నర్ బ్రదర్స్ నిర్మించనున్న ‘అకిర’ సినిమాని వైటిటి డైరెక్ట్ చేయాల్సి ఉంది. అయితే స్క్రిప్ట్ విషయంలో నిర్మాతలతో వైటిటికి అభిప్రాయ భేదాలు తలెత్తడంతో ఆ సినిమా నిర్మాణం వాయిదా పడింది. ఈలోపు ‘థోర్ 4’ ఛాన్స్ రావడంతో గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు వైటిటి. ఈ సినిమా తర్వాత ఆయన ‘అకిర’ను డైరెక్ట్ చేయనున్నాడు. కాగా ‘థోర్ 4’లో నాయికగా టెస్సా థాంప్సన్ నటించనున్నది.

‘థోర్ 4’కు డైరెక్టర్ ఆయనే | actioncutok.com

More for you: