“మీ కుసంస్కారాన్ని ఏమనాలి?”: ట్రోలర్స్‌కు తమ్మారెడ్డి సూటి ప్రశ్న


"మీ కుసంస్కారాన్ని ఏమనాలి?": ట్రోలర్స్‌కు తమ్మారెడ్డి సూటి ప్రశ్న

“మీ కుసంస్కారాన్ని ఏమనాలి?”: ట్రోలర్స్‌కు తమ్మారెడ్డి సూటి ప్రశ్న

‘ఆడై’ (తెలుగులో ‘ఆమె’) సినిమాలో తాను పడిన కష్టాన్ని అమలా పాల్ చెప్పుకుంటే దాన్ని కూడా ట్రోల్ చేసే మీ కుసంస్కారాన్ని ఏమనాలని సీనియర్ డైరెక్టర్, ప్రొడ్యూసర్ తమ్మారెడ్డి భరద్వాజ్ ట్రోలర్స్‌ను సూటిగా ప్రశ్నించారు. ఇలాంటి వాటిని కుసంస్కారంతో కాకుండా సంస్కారంతో చూడాలని హితవు పలికారు. అమలా పాల్ నాయికగా రత్నకుమార్ డైరెక్టర్ చేసిన తమిళ చిత్రం ‘ఆడై’ను తెలుగులో ఆయన ‘ఆమె’ పేరుతో విడుదల చేస్తున్నారు. జూలై 19న ఆ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.

“నా నలభై ఏళ్ల కెరీర్‌లో నాకు తగలని షాక్ ఈ ‘ఆమె’ సినిమా. పోస్టర్ చూసి కమర్షియల్‌గా పనికొస్తుందనే ఉద్దేశంతో సినిమా కొనాలనుకున్నా. సినిమా చూశాక రత్నకుమార్ అసలు ఈ కథ ఎలా రాశాడు.. అతనికి బుద్ధి ఉండి రాశాడా, లేక బుద్ధిలేక రాశాడో తెలీదు. అతనికి బుద్ధిలేకపోతే పోనీ.. ఈ పిల్ల (అమలా పాల్)కు ఎందుకు బుద్ధి లేదు! బట్టల్లేకుండా సీన్లు రాస్తే ఈవిడ చేస్తానంటుందా? వీళ్లిద్దరూ చేస్తామంటే, వీళ్లతో సినిమా తీసిన ఆ ప్రొడ్యూసర్ ఇంకెంత పిచ్చోడు?.. అనుకున్నా. అయితే అంతకంటే పిచ్చోడ్ని నేను. అది వేరే సంగతి.

నన్ను చూసి మిగతా నిర్మాతలు వచ్చారు. మమ్మల్ని చూసి డిస్ట్రిబ్యూటర్ కొన్నాడు. సినిమా అంటే కల. దర్శకుడు ఈ సినిమాని కలగన్నాడు. కథలో ఒక పరిస్థితి వస్తుంది. ఆ పరిస్థితిలో ‘ఆమె’ నగ్నంగా ఉంది. ఆ సీను దర్శకుడు రాస్తే, దాన్ని చెయ్యడానికి గట్స్ కావాలి. కథను నమ్మి చేసిన అమలను అభినందించాలి. సినిమా చూశాను. న భూతో న భవిష్యత్. ఈ జనరేషన్‌లో ఇంత పెర్ఫార్మ్ చేసిన ఆర్టిస్టును నేనైతే చూడలేదు. ఈ సినిమాని తీసుకున్నందుకు నేను గర్వపడే పరిస్థితే ఉంది కానీ బాధపడాల్సిన పరిస్థితి లేదు.

ఆడినా ఆడకపోయినా భరద్వాజ మంచి సినిమాలు తీస్తాడనే ఇమేజ్ ఉంది నాకు. ఇది నా జీవితంలో మరిచిపోలేని సినిమా అవుతుంది. ఇట్ విల్ బి ఎ గ్రేటెస్ట్ ఎక్స్‌పీరియెన్స్ ఫర్ మి. ఐ లవ్ దిస్ ఫిల్మ్. ఇండస్ట్రీకి ప్యాషన్‌తో పనిచేసేవాళ్లు కావాలి. అమల ఆ సీన్ చేసినప్పుడు ట్వీట్ చేసింది. అదెందుకు చేసిందనే విషయం పక్కనపెట్టి ఆమెను ట్రోల్ చెయ్యడం మొదలుపెట్టారు. ఆడపిల్లలు పెద్దయ్యాక అమ్మానాన్నలు, అన్నదమ్ములు, అక్కచెల్లెళ్ల దగ్గర బట్టలు లేకుండా కనిపించాలనుకోరు. కేవలం భర్త దగ్గర మాత్రమే ఉంటారు.

"మీ కుసంస్కారాన్ని ఏమనాలి?": ట్రోలర్స్‌కు తమ్మారెడ్డి సూటి ప్రశ్న

ఆ ఉద్దేశంలో ద్రౌపదికి ఐదు మందైతే నాకు పదిహేనుమంది లాగా ఫీలయ్యాను అని చెప్పింది. కొన్ని రోజులు బట్టలు లేకుండా షూటింగ్ చేశాననే విషయాన్ని అలా చెప్పింది. దానికి ‘నీకు పదిహేనుమంది భర్తలు కావాలా?’ అని ట్రోల్ చెయ్యడం మొదలుపెట్టారు. ఇప్పుడు కాదు అప్పట్లోనే ద్రౌపదికి ఐదుగురు భర్తలైతే కర్ణుడి కోసం పరిగెత్తిందని రాసిన వాళ్లున్నారు. ఆడవాళ్లు పుటుక్కుమని ఒక మాటజరితే దానిపై పది మాటలనే ధోరణి ఎక్కువైపోతోంది.

ఎవరైనా ఏదైనా మాట్లాడితే వాళ్లు ఏ సందర్భంలో ఆ మాటన్నారనే విషయం అర్థం చేసుకోవాలి. అలా అర్థం చేసుకోకుండా సోషల్ మీడియాలో ఇష్టం వచ్చినట్లు ట్రోల్ చేస్తున్నారు. ఎదుటి మనిషిని చులకన చేస్తే వచ్చేది శాడిజమే. మంచి ఉంటే మంచి చెప్పడి. చెడు ఉంటే తిట్టండి. తన కష్టాన్ని అమల చెప్పుకుంటే దాన్ని కూడా ట్రోల్ చేసే మీ కుసంస్కారాన్ని ఏమనాలి? కుసంస్కారం లేకుండా సంస్కారంతో చూస్తారని ఆశిస్తాను” అని చెప్పారు.

“మీ కుసంస్కారాన్ని ఏమనాలి?”: ట్రోలర్స్‌కు తమ్మారెడ్డి సూటి ప్రశ్న | actioncutok.com

More for you: