సెప్టెంబర్ 13న ‘వాల్మీకి’ విడుదల

సెప్టెంబర్ 13న ‘వాల్మీకి’ విడుదల
వరుణ్‌తేజ్ టైటిల్ రోల్లో హరీశ్ శంకర్ రూపొందిస్తోన్న చిత్రం ‘వాల్మీకి’. తమిళ హిట్ ఫిల్మ్ ‘జిగర్తాండ’కు ఇది రీమేక్. గ్యాంగ్‌స్టర్‌గా వరుణ్‌తేజ్ కనిపించే ఈ సినిమాలో తమిళ హీరో అధర్వ మురళి ఓక కీలపాత్రలో (ఒరిజినల్లో సిద్ధార్థ్ చేసిన కేరెక్టర్) నటిస్తున్నాడు. పూజా హెగ్డే, మృణాళిని రవి హీరోయిన్లు.
14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై రామ్ ఆచంట, గోపి ఆచంట ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. అన్ని కార్యక్రమాలను పూర్తి చేసి సినిమాను సెప్టెంబర్ 13న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. మిక్కీ జె. మేయర్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి అయనంక బోస్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.
ఈ చిత్రానికి ఫైట్స్: వెంకట్, ఆర్ట్: అవినాష్ కొల్లా, ఎడిటింగ్: చోటా కె.ప్రసాద్, సంగీతం: మిక్కి జె.మేయర్, స్క్రీన్ ప్లే: మధు శ్రీనివాస్, మిథున్ చైతన్య.
సెప్టెంబర్ 13న ‘వాల్మీకి’ విడుదల | actioncutok.com
More for you: